BigTV English

Suriya : తమిళనాడులో థియేటర్ల వివాదంపై ప్రశ్న… ఖంగుతిన్న ‘కంగువ’ స్టార్

Suriya : తమిళనాడులో థియేటర్ల వివాదంపై ప్రశ్న… ఖంగుతిన్న ‘కంగువ’ స్టార్

Suriya : తెలుగు మూవీ లవర్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను సమానంగా ఆదరిస్తారు. అందుకే టాలీవుడ్ లో ఇతర భాషల సినిమాలకు కూడా భారీ సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం థియేటర్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఇతర భాషల సినిమాలకు థియేటర్లు దొరకవు అనే వివాదం రోజురోజుకు పెద్దదవుతుంది. తాజాగా దీని గురించి ‘కంగువ’ (Kanguva) స్టార్ సూర్య (Suriya)కు సూటిగా జర్నలిస్ట్ నుంచి ప్రశ్న ఎదురయింది. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్పారో చూద్దాం పదండి.


రీసెంట్ గా తమిళనాడులో ముఖ్యంగా తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు అనే అసంతృప్తి పెరుగుతుంది. తెలుగు మూవీ లవర్స్ తమిళ వాళ్లను అక్కున చేర్చుకొని, సొంత హీరోల్లా ఆదరించడం, భారీగా థియేటర్లు ఇస్తూ వాళ్ళ సినిమాలను కూడా ఇక్కడ హిట్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటే, తమిళ తంబీలు మాత్రం తెలుగు సినిమాలను అస్సలు పట్టించుకోవట్లేదు. పైగా మినిమం థియేటర్లు ఇవ్వడానికి కూడా ఆసక్తిని కనబరచట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (Ka) మూవీకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ‘క’ మూవీకి తమిళనాడులో అడిగింది కేవలం 5 థియేటర్లే. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇవ్వలేదని స్వయంగా కిరణ్ అబ్బవరం వెల్లడించారు.

అయితే కేవలం తెలుగు మాత్రం కాదు తమిళనాడులో వేరే భాషలో సినిమాలకు కూడా థియేటర్లు ఇవ్వట్లేదు. కానీ తమిళ సినిమాలను మాత్రం అన్ని చోట్ల భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో తమిళ డిస్ట్రిబ్యూటర్ల పై ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్లు, మూవీ లవర్స్ గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva)పై ఏదో రకంగా ఆ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ‘కంగువ’ మూవీ ప్రమోషన్లలో భాగంగా సూర్య తాజాగా బెంగళూరు వెళ్లి, అక్కడ సినీ జర్నలిస్టుతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే ఒక కన్నడ జర్నలిస్ట్ డైరెక్ట్ గా ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ‘తమిళ సినిమాలకు మా దగ్గర 100 స్క్రీన్స్ ఇస్తున్నాము. కానీ అదే తమిళనాడులో కన్నడ సినిమాలకు అన్ని థియేటర్స్ ఇవ్వగలరా?” అంటూ ఓ పెద్ద హీరో సినిమా పేరు చెప్పి ప్రశ్నించారు.


దీంతో ఊహించని ఈ ప్రశ్నకు ఖంగుతిన్న సూర్య (Suriya) ‘తను డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లో లేను’ అని చెప్పారు. ‘దానికి సంబంధించిన ఏదైనా మీటింగ్ కి నన్ను ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా మాట్లాడుతాను. ఇది జరగడానికి నావంతు కృషి చేస్తాను. కానీ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అనేది మన చేతుల్లో ఉండదు. థియేటర్ల ఓనర్స్,  డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే చూసుకుంటారు. ఒకవేళ నేను ఈ విషయంలో ఏదైనా చేయగలిగితే కచ్చితంగా చేస్తాను’ అంటూ సర్ది చెప్పారు. అది కూడా నిజమే కానీ తమిళ్ డిస్ట్రిబ్యూటర్ల తీరు ఇలాగే కొనసాగితే పెరిగే అసంతృప్తి నేపథ్యంలో తమిళ సినిమాలకు వేరే భాషలలఓ థియేటర్లు దొరకడం రాను రాను కష్టమయ్యే ఛాన్స్ కూడా ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×