BigTV English

Richest People In World 2024: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే, ఒక్కొక్కరి ఆస్తుల విలువెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Richest People In World 2024: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే, ఒక్కొక్కరి ఆస్తుల విలువెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Top 10 Richest People In The World: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో సగానికి పైగా మంది దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్నారు. ఎంతో మంది ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకునేందుకు సరైన బట్టలు లేక అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అదే సమయంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతున్నారు. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా వెలుగొందుతున్నారు. తాజాగా బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ధనవంతుల లిస్టును విడుదల చేసింది. ప్రస్తుతం ఈ లిస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సంస్థ రిలీజ్ చేసిన లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

రీసెంట్ గా బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ విడుదల చేసిన టాప్ 10 అత్యంత ధనవంతుల లిస్టులో టెస్లా మోటార్, స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ నెంబర్ 1  ప్లేస్ లో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 256 బిలియన్ డాలర్లు. ఆయన తర్వాత స్థానంలో మెటా, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌ బర్గ్ ఉన్నారు. మార్క్ మొత్తం నికర విలువ 206 బిలియన్ డాలర్లు. మూవడ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జెఫ్ బెజోస్‌ ఉన్నారు. ఆయన పూర్తి ఆస్తుల విలువ 205 బిలియన్ డాలర్లు.


బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిలీజ్ చేసిన తాజా టాప్ 10 అత్యంత ధనవంతులు, వారి నికర ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

❂ ఎలాన్ మస్క్- టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత- 256 బిలియన్ డాలర్లు

❂ మార్క్ జుకర్‌బర్గ్- మెటా, ఫేస్ బుక్ అధినేత- 206 బిలియన్ డాలర్లు

❂ జెఫ్ బెజోస్- అమెజాన్ అధినేత- 205 బిలియన్ డాలర్లు

❂ బెర్నార్డ్ ఆర్నాల్ట్- లూయిస్ వీట్టన్ అధినేత- 193 బిలియన్ డాలర్లు

❂ లారీ ఎల్లిసన్- ఒకాకిల్ కార్పొరేషన్ అధినేత- 179 బిలియన్ డాలర్లు

❂ బిల్ గేట్స్- మైక్రోసాఫ్ట్ అధినేత- 161 బిలియన్ డాలర్లు

❂ లారీ పేజ్- ఆల్ఫాబెట్ ఇంక్(గూగుల్) అధినేత- 150 బిలియన్ డాలర్లు

❂ స్టీవ్ బాల్మెర్- మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో- 145 బిలియన్ డాలర్లు

❂ వారెన్ బఫెట్- బెర్క్ షైర్ హ్యాత్ వు- 143 బిలియన్ డాలర్లు

❂ సెర్గీ బ్రిన్- ఆల్ఫాబెట్ ఇంక్(గూగుల్) అధినేత- 141 బిలియన్ డాలర్లు

భారత్ లో అత్యంత ధనవంతులు   

భారత్ లో అత్యంత ధనవంతుల లిస్టులు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలి స్థానంలో ఉండగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచాడు. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 120 బిలియన్ డాలర్లు కాగా, అదానీ ఆస్తుల విలువ 116 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది అత్యధికంగా డబ్బులు సంపాదించింది వ్యక్తిగా గౌతమ్ అదానీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో గౌతమ్ అదానీ సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.

Read Also: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×