BigTV English

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

RBI On Digital Payments: భారత్ లో డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) వెల్లడించింది. కరోనా తర్వాత క్యాష్ లెస్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయినట్లు తెలిపింది. అయినప్పటికీ, నగదు చెల్లింపులు 60 శాతంగా ఉన్నట్లు తాజాగా తెలిపింది.


2024లో 48 శాతానికి పెరిగిన డిజిటల్ పేమెంట్స్

ఆర్బీఐ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం..  మార్చి 2021లో డిజిటల్ పేమెంట్స్ 14 నుంచి 19 శాతం ఉండగా,  మార్చి 2024 నాటికి 40 నుంచి 48 శాతానికి పెరిగినట్లు RBI కరెన్సీ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన ప్రదీప్ భుయాన్ తెలిపారు.”గతంతో పోల్చితే నగదు లావాదేవీలు తగ్గి, డిజిటల్ పేమెంట్స్ పెరడిగాయి. అయినప్పటికీ, నగదు లావాదేవీలు 60 శాతంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతూ, నగదు లావాదేవీలు తగ్గే అవకాశం ఉంది” అని వెల్లడించారు.  ఇక 2021 జనవరి నుంచి మార్చి కాలంలో ప్రైవేటు వినియోగ వ్యయంలో నగదు వాటా 81 నుంచి 86 శాతం ఉండగా,  2024 జనవరి నుంచి మార్చి వరకు 52 నుంచి 60 శాతానికి తగ్గినట్లు తెలిపింది.


2016లో పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. రూ. 500,  రూ. 1,000 నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ (UPI) చెల్లింపుల విధానం మొదలయ్యింది.  2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్‌ డౌన్‌ తర్వాత డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. UPI సగటు లావాదేవీలు 2016-17లో రూ. 1,525 ఉండగా, 2023-24లో రూ. 3,872కు చేరాయి. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

తక్కువ లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత

ఇక తక్కువ లావాదేవీలకు నగదు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు నివేదికలలు వెల్లడిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత 2020-21లో 13.9 శాతానికి చేరిన స్థూల దేశీయోత్పత్తి (GDP) నిష్పత్తి 2023-24లో 11.5 శాతానికి తగ్గింది. దీనికి విరుద్ధంగా, వ్యక్తి నుంచి వ్యాపారి (P2M) లావాదేవీలలో యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వాటా గణనీయంగా పెరిగింది.   2020-21లో 33 శాతం ఉండగా, 2023-24లో 69 శాతానికి పెరిగాయి. అదే సమయంలో UPI చెల్లింపుల వాటా 51 శాతం నుంచి 87 శాతానికి పెరిగింది.

UPI సగటు లావాదేవీ పరిమాణంలో తగ్గుదల, P2M లావాదేవీల పెరుగుదల కనిపించినట్లు భుయాన్ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల కారణంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇప్పటికే గణనీయంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిప్పటికీ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్న పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు సైతం మరింత జోరందుకుంటున్నట్లు భూయాన్ తెలిపారు. డిజిటల్ చెల్లింపుల కారణంగా ఆర్థిక అవకతవకలకు ఎలాంటి అవకాశం ఉండదన్నారు. క్రమ శిక్షణ కలిగిన దేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ లావాదేవీలు ఊతం ఇస్తాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు క్యాష్ లెస్ పేమెంట్స్ చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×