IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మహారాష్ట్రలోని పూణే ( Pune )వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పూణే టెస్టులో కూడా… టీమిండి అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ( New Zealand ) చేతిలో దారుణ ఓటమి చవిచూసింది టీమిండియా ( Team India ). అందరూ ఊహించినట్లుగానే… మూడవ రోజే ఈ మ్యాచ్ పూర్తయిపోయింది.
Also Read: MS Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ఔట్..ఝార్ఖండ్ ఎన్నికల బరిలోకి ధోనీ ?
రెండవ ఇన్నింగ్స్ లో… 245 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ లెటర్ బ్యాటర్లు ఎవరు కూడా… రాణించకపోవడంతో… రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీమిండియాలో యశస్వి జైస్వాల్ 77 పరుగులు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 42 పరుగులు మినహా ఏ ఒక్క ప్లేయర్ ఆడలేదు. దీంతో 245 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. అంతేకాదు… మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయింది టీమ్ ఇండియా.
Also Read: Glasgow Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !
ఈ నేపథ్యంలోనే… రెండు రికార్డులు బ్రేక్ అయ్యాయి.12 సంవత్సరాల తర్వాత… సొంత గడ్డపై టీమిండియా కు ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక అటు 69 సంవత్సరాల తర్వాత… భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య… దాదాపు 69 సంవత్సరాలుగా టెస్ట్ టోర్నమెంట్ లో జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఇవాల్టి రెండో టెస్ట్ విజయంతో… మూడు టెస్టుల సిరీస్ ను… 2-0 కైవసం చేసుకుంది న్యూజిలాండ్ ( New Zealand ).
Also Read: ICC: క్రికెట్ లో 3 కొత్త రూల్స్..ఇకపై అన్ని డేనైట్ టెస్ట్‌లు, రెండు బంతులే ?
ఈ తరుణంలోని 69 సంవత్సరాల తర్వాత భారత గడ్డపైన మొదటి టెస్ట్ సిరీస్ గెలుచుకున్న జట్టుగా న్యూజిలాండ్ ( New Zealand ) రికార్డు సృష్టించింది. ఈ 69 ఏళ్ల కలను… తాజాగా నెరవేర్చుకుంది న్యూజిలాండ్. ఈ తరుణంలోనే న్యూజిలాండ్ జట్టు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 156 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఇవాళ ఉదయం… న్యూజిలాండ్ ఆల్ అవుట్ కావడం జరిగింది. ఇక.. రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో సిరీస్ కూడా కోల్పోయింది. అయితే ఈ రెండో టెస్టులో ఏకంగా 13 వికెట్లు… పడగొట్టి రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ బౌలర్ శాంట్నర్ ( Santner ).