Toyota BZ3X EV Car: టయోటా కార్లంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త ఈవీ కారుని మార్కెట్లోకి దించింది. బుకింగ్ ఓపెనింగ్ మొదలుపెట్టిన గంటలో బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయ్యింది. కొత్త ఎలక్ట్రిక్ కారు టయోటా తన BZ3X పేరుతో EV కారుని చైనాలో విడుదల చేసింది. ఓపెనింగ్ ప్రారంభమైన మొదటి గంటలో 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. ధర కేవలం రూ. 13 లక్షల నుండి ప్రారంభమై 19 లక్షల వరకు ఉండనుంది. అందులో రకరకాల వేరియంట్స్ బట్టి ధరలు ఉండనున్నాయి. అలాగే కారు డ్రైవింగ్ రేంజ్ పరిధి మారుతూ ఉంటుంది.
టయోటా ఈవీ కారు కొత్త మోడల్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పట్ల క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. కస్టమర్లు సైతం ఈ-కార్లపై దృష్టి పెట్టారు. టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు కూడా ఇలాంటిదే. ఇటీవలే టయోటా కొత్త మోడల్ పేరుతో బీజెడ్ 3 ఎక్స్ పేరుతో కారును విడుదల చేసింది. ఇది లాంచ్ అయిన వెంటనే కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎగబడ్డారు.
GAC-టయోటా భాగస్వామ్యంతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. BZ3X ఎలక్ట్రిక్ SUV ఇటీవల చైనా మార్కెట్లో విడుదల చేసింది. చైనా మార్కెట్లో టయోటా ప్రారంబించిన అతి ధర తక్కువ కారు ఇదేనట. మొదటి గంటలో 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. టయోటా కారు కోసం వాహనదారులు బుకింగ్‌ల కోసం ఎగబడ్డారు. ఫలితంగా వెబ్‌సైట్‌పై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగి, టయోటా బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. టయోటా bZ3X 430 ఎయిర్, 430 ఎయిర్ ప్లస్ ట్రిమ్‌లలో ఉండనుంది. 50.03 kWh బ్యాటరీ నుండి 430 కి.మీ పరిధిని అందిస్తుంది.
వేరియంట్ బట్టి ధర మార్పు
అయితే వేరియంట్‌ను బట్టి కిలోమీటర్ల పరిధి పెరుగుతుంది. 520 ప్రో, 520 ప్రో+ ట్రిమ్‌లు 58.37 kWh బ్యాటరీ నుండి 520 కి.మీ పరిధిని కలిగివుంటాయి. 67.92 kWh బ్యాటరీతో టాప్-స్పెక్ 610 మ్యాక్స్ ట్రిమ్ ద్వారా గరిష్టంగా 610 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. బేస్ 430 ఎయిర్ ధరలు CNY 109,800 (దాదాపు రూ. 13 లక్షలు) నుండి ప్రారంభమై CNY 159,800 (దాదాపు రూ. 19 లక్షలు) వరకు ఉంటాయి. ఎయిర్, ప్రో మోడళ్లలో ఒకే 204 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. అయితే మాక్స్ మోడల్‌లో ఒకే 224 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది.
ALSO READ: క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసిన బ్యాంకులు
టయోటా BZ3X పొడవు 4,600 mm కాగా, వెడల్పు 1,875 mm ఉంటుంది. ఎత్తు 1,645 mm, వీల్‌బేస్ 2,765 mm పేర్కొన్నారు. ఇది సొగసైన LED లైటింగ్ ఎలిమెంట్స్, పెద్ద చక్రాలు, బలమైన బాడీ క్లాడింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ హైలైట్‌లు, ముందు కుడి క్వార్టర్ ప్యానెల్‌పై ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ఫీచర్ల కోసం కారు LiDAR సెన్సార్స్ ఉన్న విండ్‌షీల్డ్ పైన ఒక బల్బ్ ఉంది.
టయోటా bZ3Xలో 11 కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ రాడార్లు, 3 mm వేవ్ రాడార్ LiDAR ఉన్నాయి. ఇవన్నీ Nvidia Drive AGX Orin X వ్యవస్థ ద్వారా నియంత్రిస్తారు. దీనితో పాటు, ఇది 14.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 8.8-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్, 11-స్పీకర్ యమహా సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, లగ్జరీ ఇంటీరియర్ వంటి లక్షణాలను పొందుతుంది.