BigTV English

Credit Card Rules Change: క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసిన బ్యాంకులు.. ఆ ఉచిత బెనిఫిట్స్ ఇక లేవు!

Credit Card Rules Change: క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసిన బ్యాంకులు.. ఆ ఉచిత బెనిఫిట్స్ ఇక లేవు!

Credit Card Rules Change| ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ మరియు ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు పాలసీలలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మైల్‌స్టోన్‌ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్‌బీఐ తన క్లబ్ విస్తారా ఎస్‌బీఐ మరియు క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. ఈ మార్పులు 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రావనున్నాయి.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్‌స్టోన్‌ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే:

క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు. ఎయిర్ ఇండియాలో విస్తారా విమాన సంస్థ విలీనం కావడంతో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్స్ విస్తారా ట్రావెల్ కు సంబంధించిన రివార్డులు, కాంప్లిమెంటరీ ట్రావెల్ పర్క్స్ రద్దు చేశాయి.


Also Read: సిబిల్ స్కోర్ ఎలా లెక్కిస్తారో తెలుసా.. ఈ నాలుగు అంశాలే చాలా ప్రధానం

వన్‌ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.

ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్‌స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.

2025 సంవత్సరం మార్చి 31 తర్వాత.. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగియగానే.. కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు పాలసీలలో మార్పులు
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.

రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్‌స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.

క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్ల సదుపాయం ఉండదు.

బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.

వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.

మార్పుల వెనుక కారణం
నవంబర్‌ 2024లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ కీలక మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్‌బీఐ మరియు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు.

ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

ఎయిర్ పోర్ట్ లలో కాంప్లిమెంటరీ లౌంజ్ సేవలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేసింది. ఇంతకుముందు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ విమానాశ్రయాల్లో ఉచితంగా ఈ సేవలు పొందేవారు. కానీ జనవరి 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలు లోకి వచ్చాయి. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు దారులు గత ఆర్థిక త్రైమాసికంలో కనీసం రూ.75,000 ఖర్చు చేసి ఈ సేవలు పొందవచ్చు. ఉదాహరణకు డిసెండర్ 26, 2024 నుంచి మార్చి 25, 2025 వరకు గల త్రైమాసిక కాలంలో కార్డు హోల్డర్ రూ.75,000 కనీస ఖర్చు చేసి ఉంటే అతనికి ఏప్రిల్ 2025 నుంచి జూన్ 2025 త్రైమాసికంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే ఒక రకంగా ఉచితంగానే కానీ కార్డు వినియోగం చేసేవారికి మాత్రమే ఎయిర్ పోర్ట్ లౌంజ్ సేవలన్నమాట.

ఈ నిబంధనలు క్రెడిట్ కార్డులకే కాదు.. ఏప్రిల్ 1, 2025 నుంచి రూపే డెబిట్ కార్డులకు కూడా వర్తిస్తాయి.

భారతదేశానికి చెందని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ స్థాయిలో వీసా, మాస్టర్ కార్డ్ తో పోటీ పడేందుకు రూపే కార్డులపై మరిన్ని బెనిఫిట్స్, సేవలు అందించబోతోంది. కాంప్లిమెంటరీ.. డొమెస్టిక్, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లౌంజ్ ఉచిత సేవలు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ కవరేజ్, గోల్ఫ్ క్లబ్, జిమ్ మెంబర్ షిప్, స్పా సెషన్స్ వంటి లగ్జరీ బెనిఫిట్స్ తో పాటు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్, ఉచిత ప్రయాణాల కోసం క్యాబ్ వౌచర్స్ లాంటివి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×