TRAI Introduces New Guidelines on Sim Cards from July 1st: రోజురోజుకు కాలం వేగంగా పరిగెడుతోంది. అందుల్లోనూ టెక్నాలజీ రంగలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతే మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి. అయితే మొబైల్ రంగంలో సిమ్ కార్డు సేల్స్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతుండడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
మొబైల్ నంబర్ ఫోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) నిబంధనలో మార్పులు చేయాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. 2009లో ఎంఎన్‌పీ సదుపాయం ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు 9సార్లు నిబంధనలు మార్చింది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్ లైన్ ఫైనాని్షయల్ ఫ్రాడ్స్ నిరోధించడం, సిమ్ కార్డు యూజర్ల మెరుగైన భద్రత, వెరిఫికేషన్ పై మరింత కఠినంగా ఉండనున్నాయి.
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం సలహాలతోపాటు వివిధ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు ట్రాయ్ తెలిపింది.
Also Read: ఐటీఆర్ ఫైల్స్ చేస్తున్నారా? అయితే ఈ పది రూల్స్ పాటిస్తే డబ్బు ఆదా!
ట్రాయ్ రూల్స్‌లో ప్రధానమైంది సిమ్ స్వాప్. ఇందులో సిమ్ పాడైపోయినా లేదా దొంగలించడినా సమయాల్లో, సిమ్ మార్చిన తర్వాత కనీసం 7 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ సమయాల్లో ఇతర నెట్ వర్క్‌కు ట్రాన్స్ ఫర్ చేయడం సాధ్యం కాదు. దీని తర్వాతనే కొత్త సిమ్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే, కస్టమర్ 7 రోజుల్లో సిమ్ కార్డు మార్చినట్లయితే..టెలికాం కంపెనీలు వారికి యూనిక్ పోర్టింగ్ కోడ్ లేదా యూపీసీ జారీ చేయడం కుదరదు. ఈ యూపీసీ కోడ్‌తో మొబైల్ నంబర్ ను మరో నెట్ వర్క్ కు బదిలీ చేసుకోవచ్చు. దీంతో కస్టమర్ పేరిట ఉన్న సిమ్ ను ఇతరులు తీసుకోకుండా ఉండేందుకు 7 రోజులు వేచి ఉండాలి.
సిమ్ కార్డు అప్ గ్రేడ్ ను వన్ టైమ్ పాస్ వర్డ్ తో మార్చుకోవచ్చు. కానీ ఫోన్ నంబర్ ను సిమ్ పోర్టింగ్ లేదా ఎంఎన్‌పీలో ఉంచితే నెట్ వర్క్ మారుతుంది. దీంతో మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిమ్ కార్డు పోయినా, పనిచేయకన్నా కస్టమర్..టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లి గుర్తింపు కార్డులను సైతం చూపించి కొత్త సిమ్ లేదా పోర్టు చేసుకునేందుకు వీలు ఉంటుంది.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తదితర యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ తెలిపింది. ముఖ్యంగా ఆన్ లైన్ మోసలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.