BigTV English

New Bike Launched: మోడ్రన్-క్లాసిక్ లుక్‌లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!

New Bike Launched: మోడ్రన్-క్లాసిక్ లుక్‌లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!

Triumph Bonneville T120 Bike Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన అప్డేటెడ్ ‘ట్రయంఫ్ బోన్నెవిల్లే T120’ (Triumph Bonneville T120) బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను రూ.11.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది. అప్డేటెడ్‌తో ఈ బైక్ కొత్త కలర్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌ను ఇప్పుడు కొత్త డ్యూయల్-టోన్ అల్యూమినియం/బాజా ఆరెంజ్ పెయింట్ స్కీమ్‌లో కొనుగోలు చేయవచ్చు.


కొత్త ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్ మోడ్రన్-క్లాసిక్ లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. కొత్త ట్రయంఫ్ బోనెవిల్లే T120 బైక్‌లో క్లాసిక్ లుక్‌ని పెంచడానికి హెడ్‌ల్యాంప్, కర్వీ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ సీటు అమర్చారు. అయితే కాస్మెటిక్ అప్‌డేట్‌లు మినహా, మోటార్‌సైకిల్‌లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదు. భారతీయ మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్ మోడల్ BMW R 9T, డుకాటి స్క్రాంబ్లర్ 1200 బైక్‌లకు గట్టి పోటీగా ఉంది.

ఈ కొత్త బైక్ డ్యూయల్-టోన్ క్రిస్టల్ వైట్‌లో క్రాన్‌బెర్రీ రెడ్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఈ కలర్‌తో పాటు, ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 సఫైర్ బ్లూ/సిల్వర్ బ్లూ, జెట్ బ్లాక్, కార్నివాల్ రెడ్/ఫ్యూజన్ వైట్, కాంపిటీషన్ గ్రీన్/ఐరన్‌స్టోన్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్ ఇంజన్ విషయానికి వస్తే.. ఇది 900cc, లిక్విడ్-కూల్డ్, పారలెల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది.


Also Read: ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!

ఈ ఇంజన్ 7,400rpm వద్ద 64.1bhp శక్తిని, 3,750rpm వద్ద 80Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ట్రాన్స్‌మిషన్ కోసం.. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు సెమీ-డిజిటల్ డ్యూయల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రౌండ్ షేప్ మిర్రర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

ఇకపోతే ట్రయంఫ్ గత నెలలో తన బైక్‌ల ధరలను పెంచింది. ట్రయంఫ్ ఇండియా తన ఎంట్రీ-లెవల్ బైక్‌లు స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X ధరలను గత నెలలో పెంచింది. ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X బైక్‌ల ధర సుమారు రూ.1,500 పెరిగింది. ఆ తర్వాత ట్రయంఫ్ స్పీడ్ 400 కొత్త ధర రూ. 2,34,497 కాగా, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్ బైక్ ధర రూ. 2,64,496 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గతేడాది భారత్‌లో విడుదలైన తర్వాత ఈ బైక్‌ల ధరను తొలిసారిగా పెంచారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×