Business Ideas: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగంతో పాటు వ్యాపారంలోనూ రాణించాలని యువత కోరుకుంటోంది. అయితే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే స్థోమత లేక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం కేవలం రూ. 5 లక్షల లోపు పెట్టుబడితో ప్రారంభించి, ప్రతి నెలా నిలకడైన ఆదాయాన్ని అందించే నాలుగు వినూత్న, ఆధునిక బిజినెస్ ఐడియాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.
పెరుగుతున్న సాంకేతికతతో పాటే ప్రజల జీవనశైలి కూడా మారుతోంది. ప్రస్తుతం ఆటోమేటెడ్ సేవలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్ వెండింగ్ మెషిన్’ ఏర్పాటు చేయడం మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఐటీ పార్కులు, మాల్స్, ఆసుపత్రులు, కాలేజీలు, జిమ్‌ల వద్ద స్నాక్స్, పానీయాలు, శానిటరీ నాప్‌కిన్స్, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కూడిన వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేస్తే మంచి రాబడి ఉంటుంది. కస్టమర్లు క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ (UPI) ద్వారా చెల్లించి క్షణాల్లో తమకు కావలసినవి పొందవచ్చు. మార్కెట్లో మంచి వెండింగ్ మిషన్ ధర రూ.3.5 – 5 లక్షల వరకూ పలుకుతోంది.
ప్రస్తుతం సోలార్ వినియోగం ఊహించిన దానికంటే వేగంగా పెరుగుతోంది. ప్రతి ఇంటిపై, అపార్ట్‌మెంట్లపై, వాణిజ్య భవనాలపై సోలార్ ప్యానెళ్లు వెలుస్తున్నాయి. అయితే సోలార్ ప్యానెళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే సుమారు 20-30 శాతం వరకు విద్యుత్ ను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇక్కడే ప్రొఫెషనల్ క్లీనింగ్ సర్వీస్ అవసరం అవుతుంది. ఈ బిజినెస్ లో అడుగుపెట్టడం ద్వారా మంచి లాభాలను అర్జించవచ్చని నిపుణులు అంటున్నారు. రోబోటిక్ క్లీనింగ్ కిట్లు, ప్రెషర్ వాషర్లు, సేఫ్టీ ఎక్విప్‌మెంట్, రవాణా కోసం కేవలం రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలు సరిపోతాయి. మెయింటెనెన్స్ కాంట్రాక్టుల ద్వారా స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.
పెంపుడు జంతువులను (Dogs, Cats) తమ కుటుంబ సభ్యులుగా భావించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఉద్యోగులు, బిజీ లైఫ్ గడుపుతున్న వారికి తమ పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూసుకోవడానికి సమయం దొరకడం కష్టం. దీనికి చెక్ పెడుతూ ఒక మంచి బిజినెస్ ను స్టార్ట్ చేయవచ్చు. పెట్ గ్రూమింగ్ (స్నానం, హెయిర్ కటింగ్), రోజువారీ వాకింగ్, డాగ్ ట్రైనింగ్, ప్రీమియం పెట్ ఫుడ్ డెలివరీలను కలిపి ‘నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్’ కింద అందించొచ్చు. మొబైల్ వెహికల్ సర్వీస్, హోమ్ విజిట్ మోడల్‌లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
Also Read: ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భీమవరం వ్యవహారం భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై
ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయంలో వాటర్ ట్యాంకులు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే ఆరోగ్యకరమైన జీవనానికి శుభ్రమైన నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చాలా మంది కొన్ని నెలల పాటు ట్యాంకులను శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. కాబట్టి ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ బిజినెస్ ను ప్రారంభించడం ద్వారా ఆదాయాన్ని అర్జించవచ్చు. అధునాతన వాక్యూమ్ పంపులు, యూవీ రేడియేషన్, యాంటీ-బాక్టీరియల్ మందులను ఉపయోగించి అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని వాటర్ ట్యాంకులను ప్రొఫెషనల్‌గా శుభ్రం చేసే సేవలను అందించవచ్చు.
Also Read: సింహాన్ని బైకులపై వెంబడించిన అటవీ సిబ్బంది.. తిరగబడ్డ మృగరాజు, వీడియో వైరల్!