Qualcomm Layoff| ఉద్యోగం పోతే చాలామంది ఆందోళన చెందుతారు. కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుందోనని టెన్షన్ పడతారు. కానీ ఒక ఐటీ ఉద్యోగి మాత్రం తన ఉద్యోగం పోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాడు. ఎందుకంటే ఆ కంపెనీ అతనికి భారీ పరిహారం చెల్లించి మరీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో వెంటనే మరో ఉద్యోగంలో చేరకుండా కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
క్వాల్‌కామ్ ఒక అమెరికన్ మల్టీనేషనల్ సెమీకండక్టర్, టెలికమ్యూనికేషన్స్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఉంది. ఇర్విన్ జాకబ్స్, ఆండ్రూ విటెర్బీ, మరికొందరు కలిసి 1985 జూలైలో ఈ కంపెనీ స్థాపించారు. వైర్‌లెస్ టెక్నాలజీలు, మొబైల్ ప్రాసెసర్లు, డివైజ్‌లలోనే పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్‌లను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. ఇటీవలే కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
క్వాల్‌కామ్‌లో పనిచేసే సదరు సీనియర్ ఇంజనీర్ రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన క్వాల్‌కామ్‌లో సుమారు 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల ఎదురైన పరిస్థితులు తనకు ఉద్యోగంపై ఆసక్తి తగ్గించాయని తెలిపారు.
6 నెలల క్రితం ఆయన కంపెనీలోనే మరో టీమ్‌కు మారారు. కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు మరో నగరానికి కూడా వెళ్లారు. అయితే కొత్త టీమ్‌లో ఆయనకు ఆశించిన అనుభవం ఎదురుకాలేదు. సహోద్యోగుల నుంచి సరైన సహకారం లభించలేదని ఆయన పేర్కొన్నారు. తన సాంకేతిక నైపుణ్యాలపై కూడా కొందరు ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు. గతంలో తన మేనేజర్ పైథాన్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను ప్రశంసించారని గుర్తుచేసుకున్నారు. కొత్త టీమ్‌లో పరిస్థితులు నచ్చక ప్రతిరోజూ ఉద్యోగం మానేయాలని అనిపించేదని చెప్పారు. అయితే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే గతంలో పొందిన రీలోకేషన్ బోనస్ తిరిగి చెల్లించాల్సి వచ్చేదని వివరించాడు.
క్వాల్‌కామ్‌లో ఉద్యోగుల తొలగింపుల గురించి సమాచారం రావడంతో ఆయన మేనేజ్‌మెంట్‌ను సంప్రదించారు. తనను కూడా లేఆఫ్ జాబితాలో చేర్చాలని డైరెక్టర్, మేనేజర్‌ను కోరారు. చివరకు కంపెనీ ఆయన ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆయన నిరాశ చెందకుండా ఉపశమనం పొందినట్లు తెలిపారు.
తన రెడ్డిట్ పోస్టులో పరిహార వివరాలను కూడా అతను వెల్లడించాడు.
జనవరి చివరి వరకు సాధారణ జీతం కూడా అందుతుందని ఆయన భావిస్తున్నారు. దీనివల్ల మొత్తం ప్రయోజనాలు సుమారు 15 నెలల ఆదాయానికి సమానంగా ఉండవచ్చని అంచనా.
Also Read: ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?
ప్రస్తుతం వెంటనే మరో ఉద్యోగంలో చేరాలని ఆయన భావించడం లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపాలని అనుకుంటున్నారు. అలాగే చదువుపై దృష్టి పెట్టి ఇంటర్వ్యూలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు.
Also Read: బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్
కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 శాతం ఉద్యోగులను తగ్గించే ప్రణాళిక చేపట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల దాదాపు 3,600 మంది ఉద్యోగులపై ప్రభావం పడవచ్చని అంచనా. భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.