TuhinKanta Pandey: మార్కెట్, పెట్టుబడుల రెగ్యులేటరీ సంస్థ-సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా ) కొత్త ఛైర్మన్‌గా తుహిన్ కాంత పాండే బాధ్యతలు స్వీకరించారు.ఈ పదవిలో ఆయన మూడేళ్లు కొనసాగుతారు. అందుకు ముందు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. సెబీ 11వ ఛైర్మన్‌గా పాండే శనివారం బాధ్యతలు చేపట్టారు. సెబీ సభ్యులు అశ్వనీ భాటియా, అమర్ జీత్ సింగ్ , అనంత్ నారాయణ్, కమలేష్ వర్ష్ నేలు ఆయనకు స్వాగతం పలికారు.
సెబీకి కొత్త బాస్
గతంలో సెబీ ఛైర్మన్ మాధబి పూరీ బుచ్ పదవీకాలం శుక్రవారంతో పూర్తి అయ్యింది. ఆమె బాధ్యతల్లోకి తుహిన్ వచ్చారు. ఇక ఒడిషా కేడర్ 1987 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందినవారు ఆయన. పలు హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. సెబీ బాధ్యతలు చేపట్టక ముందు 2024 సెప్టెంబర్ నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయి. ఎఫ్‌ఐఐలు తరలిపోతున్న సవాళ్ల వేళ పాండే బాధ్యతలు స్వీకరించారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు అఫ్ ఇండియా-సెబీ ఛైర్మన్‌గా తుహిన్ కాంత పాండేని నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు తుహిన్ ఆ పదవిలో కొనసాగనున్నారు.
సెబీ చైర్మన్ పదవి కోసం కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి ధరఖాస్తులు ఆహ్వానించింది. తుది గడువుని ఫిబ్రవరి 17గా పేర్కొంది. ఈ పదవి కోసం దాదాపు నలుగురు అధికారులు పోటీ పడ్డారు. వారిలో తుహిన్ కాంత పాండే, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, పెట్రోలియం-నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ జైన్, సెబీ హోల్ టైమ్ మెంబర్ కేసీ వర్షేన్ పోటీ పడిన విషయం తెల్సిందే.
ALSO READ: మారుతి సుజుకి ఆల్టో K10 న్యూ వేరియంట్
ప్రస్తుత సెబీ ఛైర్మన్ మధబి పూరి బుచ్ పదవీకాలం మార్చి ఒకటితో యుగియనుంది. మార్చి రెండున నేటి నుంచి కొత్త చైర్మన్ తుహిన్ బాధ్యతలు చేపట్టారు. తుహిన్ కాంత పాండే ఒడిషాకు చెందిన 1987 బ్యాచ్ అధికారి. రెవెన్యూ కార్యదర్శిగా ఈ ఏడాది జనవరి 09న ఆయన బాధ్యతలు చేపట్టారు. కేవలం 2 నెలలు మాత్రమే ఆయన పని చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2025 రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తుహిన్ హిస్టరీలోకి ఒక్కసారి
గతంలో తుహిన్ పాండే డిపాట్మెంట్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మ్యానేజ్మెంట్ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. తుహిన్ పాండే చండీఘడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ధిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత యూకే నుంచి MBA పట్టా పొందారు. కెరీర్‌లో ఆయన కేంద్రం, ఒడిషా ప్రభుత్వాల్లో అనేక కీలక పదవులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఇంతవరకు బాగానే ఉంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజులుగా మార్కెట్ పతనం అవుతూ వస్తోంది. దాన్ని ఆయన ఏ విధంగా గట్టెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.