BigTV English

Loan App : లోన్‌యాప్‌లో రుణం మంచిదేనా?

Loan App : లోన్‌యాప్‌లో రుణం మంచిదేనా?
Digital Loan App

Digital Loan App (today news telugu):


ప్రస్తుతం డిజిటల్ లోన్ యాప్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంట్లోనే ఉండి, ఆన్‌లైన్‌లోనే రుణం తీసుకునే వెసులుబాటు, అతి తక్కువ సమయంలోనే లోన్ పొందే అవకాశం ఉండటం దీనిలో సానుకూల అంశాలు. అయితే.. ఇందులో కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

లోన్ నిబంధనలు, షరతులు, తిరిగి చెల్లించే పద్ధతి, వడ్డీరేటు, గడువు, పెనాల్టీ, వంటివాటిని గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి. లోన్ పేరుతో మితిమీరిన రీతిలో వ్యక్తిగత సమాచారం సేకరించటం ప్రమాదం. అందుకే యాప్ వారి ప్రైవసీ పాలసీ ఏమిటో తెలుసుకోవాలి. మెరుగైన కస్టమర్‌ సర్వీస్‌, రుణ గ్రహీతలను వేధించడం వంటి అంశాల ప్రాతిపదికన యాప్ రివ్యూలు చదివి ఒక అవగాహనకు రావాలి.


డిజిటల్‌ రుణం తీసుకోవడంలో క్రెడిట్‌స్కోర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రుణం తీసుకున్న ప్రతిసారీ దీనిపై ప్రభావం పడుతుంది. తక్కువ సమయంలో అనేక సార్లు రుణాలు తీసుకుంటే క్రెడిట్‌స్కోర్‌ తగ్గుతుంది గనుక తక్కువ టైంలో ఎక్కువ రుణాలు తీసుకోవద్దు. క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. ఏదైనా తప్పులుంటే సరిచేసుకున్నాకే రుణం కోసం ప్రయత్నించండి. చివరిగా… రుణం తీసుకునే ముందు తిరిగి చెల్లించే అవకాశాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×