Union Budget 2025-26| పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త తెలిపారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీనికి మరో రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే, రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు
కొత్త ఆదాయ పన్ను విధానంలో మారిన శ్లాబ్‌లు ఇవే:
⦿ రూ.0-4 లక్షలు – సున్నా
⦿ రూ.4-8 లక్షలు – 5%
⦿ రూ.8-12 లక్షలు – 10%
⦿ రూ.12-16 లక్షలు – 15%
⦿ రూ.16-20 లక్షలు – 20%
⦿ రూ.20-24 లక్షలు – 25%
⦿ రూ.24 లక్షల పైన – 30%
ఈ మార్పులే కాకుండా ఆదాయ పన్ను నుంచి ప్రత్యేకంగా ఉద్యోగులకు మినహాయింపులు ప్రకటించారు. ముఖ్యంగా వార్షికాదాయం రూ.12 లక్షలు ఉన్న వేతనజీవులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రూ.12 లక్షలకు అదనంగా రూ.75,000 రిబేట్ కలుపుకుంటే మొత్తం రూ.12 లక్షల 75వేలు వార్షికాదాయంపై ఉద్యోగులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్‌డేటెడ్ ఇన్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కి రెండేళ్లు ఉన్న గడువు కూడా 4 ఏళ్లకు పెంచారు. విద్యా రుణాలపై టిసిఎస్ రద్దు చేశారు.
ఈ మార్పుల ద్వారా మధ్యతరగతి, వేతన జీవులకు పన్ను భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ పన్నుల మినహాయింపు ద్వారా మధ్య తరగతికి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పొదుపు చేయడానికి, వినియోగానికి అవకాశం కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అద్దెపై టిడిఎస్
అయితే అద్దె ద్వారా వచ్చే ఆదాయంలో టిడిఎస్ శాతాన్ని పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.6 లక్షలు ఆపైన వచ్చే అద్దె ఆదాయంలో టిడిఎస్ డిడక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. పైగా స్థిరాస్తి యజమానులకు కూడా ఊరటనిస్తూ.. ఇప్పటివరకు ఒకే ఇంటిని నివాసంగా ఉన్న అనుమతి.. రెండు నివాసాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. వీటికి తోడు ఒక అద్దె చెల్లించే టెనెంట్ యజమానికి రూ.50,000 ప్రతి నెలా అద్దె చెల్లిస్తుంటే.. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ చట్టం ప్రకారం.. అందులో నుంచి టిడిఎస్ కట్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు అద్దె ఆదాయంపై టిడిఎస్ మినహాయింపు రూ.2,40,000 వరకు ఉండేది. గతంలో 2018-19లో అయితే ఈ పరిమితి రూ.1,80,000 వరకే ఉండేది. అయితే ఇప్పుడు టిడిఎస్ పై ఎడుకేషన్ సెస్, లేదా సెకండరీ ఎడుకేషణ్ సెస్ ఉండదు.