MyJio App: ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ మాల్స్‌కి వెళ్ళి కొనడం కంటే, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం చాలా సౌకర్యంగా మారింది. కానీ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని సులభంగా వాడలేరు. కొంతమంది వృద్ధులకు, టెక్నాలజీకి కొత్తగా ఉన్న వారికి ఆన్‌లైన్ షాపింగ్‌లో అయోమయం అనిపిస్తుంది. డిస్కౌంట్ నిజంగానే బెటరా? సైజ్ సరిపోతుందా? చెల్లింపులు సేఫ్‌గా ఉంటాయా? అన్న అనుమానాలు తప్పవు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మై జియో ప్రత్యేకంగా తీసుకొచ్చిన సర్వీస్ షాపింగ్ అసిస్ట్.
మై జియో యాప్ లేదా కస్టమర్ సపోర్ట్
డిస్కౌంట్ సేల్‌లో వెళ్లవలసిన అవసరం లేదు, జియోతో ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభంగా అన్‌లాక్ చేయండి అనే కాన్సెప్ట్ వెనుక ఉద్దేశం చాలా క్లియర్. మీరు టెక్నీషియన్ కాకపోయినా, ఈ ఫీచర్ మీకు సులభమైన గైడెన్స్ ఇస్తుంది. ఏ వస్తువు కొనాలి, ఏ బ్రాండ్ బెటర్, రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది, ఆఫర్ నిజంగానే వాల్యూ ఇస్తుందా? — అన్నదానిపై మై జియో యాప్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా స్టెప్-బై-స్టెప్ సహాయం పొందవచ్చు.
సూట్ అయ్యే ఆప్షన్స్
ఉదాహరణకు మీరు ఒక బ్లౌజ్ కొనాలని అనుకుంటే, దాని సైజ్ లేదా కలర్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే, మై జియోలో ఫొటోలు షేర్ చేయండి లేదా లింక్ పంపండి. వెంటనే మీకు సూట్ అయ్యే ఆప్షన్స్, సర్టిఫైడ్ లింక్స్ అందిస్తారు. దీంతో తప్పుడు వస్తువు ఆర్డర్ చేసే టెన్షన్ ఉండదు.
Also Read: JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..
నిజమైన డీల్స్
సులభమైన చెల్లింపుల విషయానికి వస్తే, మై జియో స్పష్టమైన సూచనలు ఇస్తుంది. కార్డ్ పేమెంట్, యూపిఐ, వాలెట్ ఆఫర్‌లు ఏది ఎక్కువ ఉపయోగం ఇస్తుందో ముందే తెలుసుకోవచ్చు. అలాగే, స్కామ్ ఆఫర్లు ఎలా గుర్తించాలో, నిజమైన డీల్స్ ఎలా ఫిల్టర్ చేయాలో కూడా ఈ ఫీచర్ క్లియర్‌గా చెబుతుంది.
ఫ్యామిలీ షాపింగ్‌కి ఉపయోగం
ఫ్యామిలీ షాపింగ్‌కి ఇది మరింత ఉపయోగపడుతుంది. మీరు మీ తల్లిదండ్రుల కోసం లేదా పిల్లల కోసం షాపింగ్ చేస్తే, వారికి సరిపడే వస్తువులు, డిస్కౌంట్లు ఎంచుకోవడంలో ఇది సహాయం చేస్తుంది. ప్రత్యేకంగా వృద్ధులు లేదా టెక్ బిగినర్స్ కోసం ఇది ఒక విశ్వసనీయ సపోర్ట్ సిస్టమ్ అవుతుంది.
వ్యక్తిగత సమాచారాన్ని మై జియో ఛానల్స్ ద్వారానే పంచుకోండి
అయితే, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకండి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ అధికారిక మై జియో ఛానల్స్ ద్వారానే పంచుకోండి. దీని వలన మీ డేటా సురక్షితంగా ఉంటుంది. వెంటనే మై జియో ఓపెన్ చేసి “అసిస్ట్ చేయండి” ఆప్షన్ ట్రై చేయండి. షాపింగ్ కోసమే కాదు, బెటర్ నిర్ణయాలు తీసుకోవడానికీ ఇది మీకు నమ్మదగిన గైడ్ అవుతుంది.