Sundarakanda OTT Release: రీఎంట్రీ తర్వాత నారా హీరో రోహిత్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రతినిధి 2తో హిట్ అందుకున్న నారా రోహిత్ ఆ తర్వాత భైరవం, సుందరకాండ వంటి చిత్రాలు చేశాడు. భైరవంతో మల్టీస్టారర్ చిత్రం. ఇందులో మెయిన్ లీడ్ బెల్లంకోండ సాయి శ్రీనివాస్. ప్రతినిధి 2 తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చని చిత్రం సుందరకాండ. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ షోతో మిక్స్డ్ టాక్ రావడంతో సుందరకాండ యావరేజ్గా నిలిచింది. ఈ చిత్రంతోనే సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్గా నటించగా.. మరో యంగ్ బ్యూటీ విర్తి వాఘని సెకండ్ హీరోయిన్గా నటించింది.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వాసుకీ, సత్య, అభినవ్, సునయన వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు ఓటీటీలోకి వచ్చింది. సైలెంట్ ఈ సినిమా జియో హాట్స్టార్లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. నెల రోజుల ముందే ఈ చిత్రం ఓటీటీలోకి రావడంతో మూవీ లవర్స్ అంత సర్ప్రైజ్ అవుతున్నారు. మరి ఇంకేందుకు థియేటర్లలో మిస్ అయినా వారు ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి ఎంజాయ్ చేయండి. కాగా ప్రతినిధి 2 తర్వాత నారా రోహిత్ ఐదేళ్ల గ్యాప్ తీసుకుని సింగిల్గా వచ్చిన చిత్రమిది.
దీంతో సుందరకాండ చిత్రంపై ఆడియన్స్ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార పోస్టర్స్ సైతం ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా రోహిత్కి మంచి విజయాన్ని ఇస్తుందని అంత అనుకున్నారు. కానీ, మిక్స్డ్ టాక్ యావరేజ్గా నిలిచింది. ఎప్పుడూ డిఫరేంట్ కథలతో అలరించే రోహిత్ ఈసారి యూత్ఫుల్ లవ్స్టోరీని ఎంచుకున్నాడు. ఇందులో రోహిత్ సిద్ధార్థ్ అనే యువకుడి పాత్ర పోషించాడు. స్కూల్లో తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)తో ప్రేమ పడతాడు. ఆమె ముందుకు ఎదురుపడకుండ సీక్రెట్ ఆమెను ఫాలో అవుతూ.. గిఫ్ట్స్ పింపిస్తుంటాడు. అలా ఒకరోజు వైష్ణవి ఇంట్లోని సమయంలో సిద్దార్థ్ గిఫ్ట్స్ కొరియర్ ద్వారా వెళుతుంది. అది ఆమె తండ్రి తీసుకుని కూతురి ప్రేమ వ్యవహరం తెలుసుకుంటాడు.
కోపంతో స్కూల్ వెళ్లి వైష్ణవిని కొడతాడు. అంతేకాదు స్కూల్ మాన్పిస్తాడు. కట్ చేస్తే వారు పెద్దవాళ్లు అయిపోతారు. సిద్దార్థ్ మాత్రం వైష్ణవిలో ఉన్న ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి వయసు 30 ప్లస్కి వస్తుంది. అలా ఎంతోమంది అమ్మాయిలను చూసి రిజెక్ట్స్ చేస్తుంటాడు. అలా ఫైనల్ ఓ అమ్మాయి (విర్తి వాఘని)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన లైఫ్ స్టైల్‌నే మార్చుకుంటాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిన సిద్దార్థ్ ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు. అదే టైంలో వైష్ణవి మళ్లీ అతడి లైఫ్లో ఎదురుపడుతుంది. దీంతో డైలామాలో పడ్డ సిద్దార్థ్ చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేది అసలు కథ.