BigTV English

Money management: నెలవారీ సంపాదనను ఇలా ఖర్చుపెట్టాలంటున్న ఆర్థిక నిపుణులు.. ఎలా అంటే..

Money management: నెలవారీ సంపాదనను ఇలా ఖర్చుపెట్టాలంటున్న ఆర్థిక నిపుణులు.. ఎలా అంటే..

Money management: ఖర్చు చేయడం అంటే అప్పటికి తోచిన విధంగా డబ్బులు ఇచ్చేయడం కాదు. ఖర్చు పెట్టడానికి ఓ లెక్క ఉంటుంది. అవును.. అందరూ సంపాదిస్తారు.. కానీ కొందరికే ఎలా ఖర్చు చేయాలో తెలుస్తుంది. సంపాదన, ఖర్చు.. ఈ రెండింటిలో ఏది సరిగా లేకున్నా ఫలితం ఉండదు. అందుకే.. సరైన మార్గంలో ఎలా డబ్బుల్ని ఖర్చు చేయాలో, ఎలా దాచుకోవాలో తెలిపేందుకు ఓ లెక్క ఉంది అంటున్నారు.. ఆర్థిక నిపుణులు.


వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని.. అర్థిక నిపుణులు ఓ సూత్రాన్ని రూపొందించారు. అదే 50:30:20 సూత్రం అంటే.. వచ్చే డబ్బును విభజించే విధానం అన్నమాట. ఈ సూత్రాన్ని ఫాలో అయితే.. ఇప్పటి అవసరాలు తీరడమే కాదు, భవిష్యత్త్ జీవితానికి భరోసా దక్కుతుందని చెబుతున్నారు. మరి.. డబ్బు సంపాదించేది అందుకే కదా. రిటైర్మెంట్ అయిన తర్వాతో, సంపాదించే మార్గాలు మూసుకు పోయినప్పుడో.. ఒకరిపై ఆధారపడకుండా జీవించేందుకు.. ఈ సూత్రం మార్గం చూపుతుంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూత్రానికి అర్థం తెలుసుకోండి, ఫాలో అయి ఆర్థిక భద్రతను పొందండి.

మీకు వచ్చే నెలసర్ ఆదాయాన్ని తప్పనిసరి జీవన వ్యయాలు, వ్యక్తిగత అవసరాలు, దీర్ఘకాలిక ఆర్థిక పొదుపు విభాగాల వారీగా విభజించుకోవాలి. ఇందుకోసం, 50:30:20 నిష్పత్తిలో ముూడు భాగాలుగా డబ్బును విభజించాలి.


ముందుగా 50 శాతంతో ప్రారంభం

వచ్చిన జీతం, ఆదాయంలో నుంచి మొదటే 50 శాతాన్ని పక్కకు తీసేయండి. ఈ డబ్బుల్ని అత్యవసర అవసరాలకు వినియోగించండి. అంటే… ఇంటి అద్దె, కిరాణా సామాను, ప్రయాణ ఖర్చులు, ఇంట్లో ఇతర అవసరాలు వంటివి ఇందులో నుంచి ఖర్చు చేయాలి. ఇలా చేయడం వల్ల మీపై ప్రాథమిక అవసరాలు తీరి.. మరో నెల వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతీ రోజూ.. ఆఫీస్ కు వెళ్లేందుకు, ఇంట్లోకి అవసరమైన సరకులు తెచ్చుకునేందుకు కావాల్సిన డబ్బులకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. దాంతో.. మిగతా పనులపై దృష్టి పెట్టేందుకు సమయం కుదురుతుంది.

30 శాతం డబ్బుల్ని ఇలా వినియోగించాలి.

డబ్బు సంపాదించేది.. మన కోర్కెలు తీర్చుకోవాడానికి కూడా. సంపాదించామా, అన్నీ ఏదో అవసరాలకు ఖర్చు చేశామనో, లేదా పొదుపు పేరుతో దాచుకున్నామనో అనుకుంటే సరిపోదు అంటారు.. నిపుణులు. కచ్చితంగా ప్రతీ వ్యక్తి కొంత డబ్బును తనపై ఖర్చు చేసుకోవాలని సూచిస్తుంటారు. ఈ డబ్బుల్ని.. సరదాగా రెస్టారెంట్లకు వెళ్లేందుకో, సినిమాలు చూసేందుకో, లేదా.. ఇష్టమైన ప్రాంతాలు చూసి వచ్చేందుకో వినియోగించాలి. అలాగే.. వ్యక్తిగత అలంకరణలు, ఇష్టమైన వస్తువులు కొనేందుకు.. ఈ విభాగంలోని డబ్బుల్నే వినియోగించాలి. లేదంటే.. కొంత సమయానికి చేసే పనిపై, ఉద్యోగంపై నిరాసక్తి వస్తుందని, లైఫ్ బోరింగ్ గా మారిపోతుందని అంటున్నారు.

కష్టపడి సంపాదించేది.. ఇతరుల కోసం, అప్పుల కోసమనే ఆలోచనలు వస్తుంటాయి. ఇవి మీ ఉత్సాహాన్ని తగ్గించడమే కాకుండా.. మీరు సరికొత్తగా చేయాలనుకునే ప్రయత్ని మొదట్లోనే ఆపేస్తాయి అంటున్నారు. అందుకే.. కొంత డబ్బును మీ అవసరాలకు వినియోగించండి.

చిన్న నియమం.. పెద్ద ఉపయోగం

అత్యవసర అవసరాలు, వ్యక్తిగత ఖర్చులు అయిపోయాక.. ఇక మిగిలిన 20 శాతం డబ్బుల్ని పొదుపు కోసం వినియోగించాలి. ఈ డబ్బుల్ని వివిధ మార్గాల్లో నిరంతరం దాచుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. మీకు ఏవైనా అప్పులుంటే.. వాటిని తీర్చేందుకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని చెబుతున్నారు. అయితే.. మీరు చేసిన అప్పులు ఎందుకు చేసారనేది ముఖ్యమంటున్నారు.

ఏదైనా పట్టణం, నగరంలో ఇళ్లు కొనుగోలు చేస్తే.. క్రమంగా దాని విలువ పెరుగుతుంది. కాబట్టి దాని మీద కట్టే అప్పును బరువుగా భావించకుండా.. పొదుపుగానే భావించాలని చెబుతున్నారు. అలాగే.. ఏదైనా వ్యాపారానికో, అస్తుల కొనుగోలుకో చేసిన అప్పుల్ని తీర్చేందుకు వీటిని వాడాలి. మీకు ఎలాంటి అప్పులు, ఈఎమ్ఐలు లేకుంటే.. భద్రమైన పొదుపు మార్గాల్లో ఈ డబ్బుల్ని దాచుకోవాలని సూచిస్తున్నారు. రిస్క్ ఉండే చోట్ల కంటే.. దీర్ఘకాలమైన భద్రంగా తిరిగి వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లోనే, లేదా స్థిరమైన, భద్రమైన హామీ ఇచ్చే సంస్థల స్టాక్స్ రూపంలోనో దాచుకోవాలని చెబుతున్నారు.

Also Read : రియలన్స్-డిస్నీ విలీనం.. జస్ట్ రూ.15కే అదిరిపోయే ప్లాన్

దీని వల్ల ప్రతీనెల అప్పులు దగ్గించుకోవడం లేదా పొదుపు చేయడం ద్వారా.. దీర్ఘకాలంలో కావాల్సిన ఆర్థిక భద్రత లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి.. ఇప్పటి నుంచి ప్రతీనెల మీరు ఈ 50:30:20 నియమాని పాటించి.. మంచి ఆర్థిక వ్యూహాన్ని రూపొందించుకోండి. ఇది మీ తక్షణ అవసరాలను తీర్చడంతో పాటు ప్రతీనెల ఆనందించడం, భవిష్యత్తు ఆర్థిక సవాళ్లకు ఏక కాలంలో సిద్ధమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని హామీ ఇస్తున్నారు.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×