BigTV English

Maharaja: చైనాలో రిలీజ్ కానున్న మహారాజా..

Maharaja: చైనాలో రిలీజ్ కానున్న మహారాజా..

Maharaja: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి  హీరోగా నటించిన చిత్రం మహారాజా. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బూస్టర్ చిత్రాల  లిస్ట్ తీస్తే.. మొదటి వరుసలో మహారాజా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిథిలిన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు  అనురాగ్ కశ్యప్  విలన్ గా కనిపించాడు. ఎన్నో అంచనాల మధ్య  జూన్ 14 న రిలిన్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.


చిన్న సినిమాగా  రిలీజైన మహారాజా  రికార్డులు కొల్లగొట్టింది. రూ.20 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 110 కోట్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది. కేవలం థియేటర్ లో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దుమ్ము దులిపేసింది.  ఇక ఇప్పుడు ఈ సినిమా దేశం దాటబోతుంది. ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు మన దేశంలో కూడా వేరే  దేశంలో రిలీజ్ అయ్యాయి.

Matka Movie Collections : కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశారు… కానీ లక్షల్లోనే ఆగిపోయింది..


ఇప్పుడు మహారాజా  కూడా ఆ లిస్ట్ లోకే చేరుతుంది. మహారాజా సినిమాను చైనాలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యినట్లు సమాచారం. నవంబర్ 29 న మహారణా చైనాలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెలియడంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహారాజా కథ గురించి చెప్పాలంటే.. మహారాజా.. ఒక బార్బర్. తన కూతురే తనకు అన్నీ. ఇల్లు, సెలూన్ షాప్ తప్ప తనకేమి తెలియదు. ఇక ఒకరోజు వాళ్ళింట్లో లక్ష్మీ అనే చెత్త డబ్బా కనిపించకుండా పోతుంది. దాన్ని వెతికి ఇవ్వాలని పోలీసులను కోరతాడు.. దాన్ని తిరిగి తెస్తే లక్షల్లో డబ్బు ఇస్తానంటాడు. డబ్బుకోసం పోలీసులు ఆ చెత్త డబ్బాను వెతికే క్రమంలో కొన్ని అనుకోని నిజాలు బయటపడతాయి.

Nayanatara: అతడి ప్రేమ మరువరానిది.. భర్తపై ప్రశంసలు కురిపించిన నయనతార..!

మహారాజా పోలీసుల దగ్గరకు వెళ్ళింది చెత్త డబ్బా కోసం కాదని అర్ధమవుతుంది. మరి దేనికోసం మహారాజా వెతుకుతున్నాడు.. ? ఆ చెత్త డబ్బాను పోలీసులు కనిపెట్టారా.. ? మహారాజా కూతురుకు ఏమైంది.. ? అనేది సినిమా. ఒక తండ్రి.. తన కూతురుకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా పగ  తీర్చుకున్నాడు అనేది నిథిలిన్ చూపించాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరి ఈ సినిమా చైనాలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×