BigTV English

VinFast EV Car: పోటీలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు.. విన్‌ఫాస్ట్ ప్లాంట్ ఎక్కడ పెడుతుందో?

VinFast EV Car: పోటీలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు.. విన్‌ఫాస్ట్ ప్లాంట్  ఎక్కడ పెడుతుందో?

VinFast EV Car: విన్‌ఫాస్ట్ ఈవీ కార్ల కంపెనీ నెక్ట్స్ అడుగులు ఎటు? కొత్త ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణలో పెడుతోందా? రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న చర్చలు ఎంతవరకు వచ్చాయి? భారత్‌ని తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


జనాభా కాకుండా వ్యాపార పరంగా చాలా కంపెనీలకు కేంద్రబిందువు భారత్. ఇక్కడ తమ వ్యాపారాలు విస్తరించుకుంటే ఢోకా ఉండదని వివిధ కంపెనీల అంచనా. ఇప్పటికే ఎలన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా భారత్‌లో అడుగు పెట్టనున్నారు. మరో విదేశీ కార్ల కంపెనీ కూడా భారత్ మార్కెట్‌పై కన్నేసింది.

కార్లు కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉండడం ఒకటైతే, కంపెనీలో పని చేసేందుకు స్కిల్డ్ వర్కర్లు ఇక్కడ కొదవలేదు. ఈ రెండింటినీ అందిపుచ్చుకోవాలని భావిస్తోంది వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ ఈవీ కార్ల కంపెనీ. భారత్‌లో కేవలం కార్ల తయారీ కేంద్రంతోపాటు డీలర్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.


దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది ఆ కంపెనీ. ప్రస్తుతం తమిళనాడులోని తూతుకుడిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగు తున్నాయి. కొద్దివారాల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఏడాదికి 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

ALSO READ: ఫిప్‌కార్ట్ ధమాకా ఆఫర్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్

విన్​ఫాస్ట్ వీఎఫ్7, వీఎఫ్6‌లను ఇక్కడ అసెంబ్లింగ్ చేయనుంది. ఇదికాకుండా తెలుగు రాష్ట్రాలపై కన్నేసింది ఆ కంపెనీ.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తోంది. చివరకు ఆ కంపెనీ ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. తమిళనాడులో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నది ఆ కంపెనీ ఆసియా సీఈవో పామ్ సాన్ చౌ మాట.

ప్లాంటుకు సమీపంలో నౌకాశ్రయం ఉండడం ఎగుమతులకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తోంది. మరో ప్లాంటుపై ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.భారత మార్కెట్‌ కీలకమని, అందుకే ప్లాంటు విస్తరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌-వియత్నాం మధ్య ఏళ్ల తరబడి దృఢమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారాయన.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×