BigTV English

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. మరో విద్యార్థి ఆత్మహత్య

Student Suicide in Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. పీయూసీ సెకండియర్ చదువుతున్న మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లాకు చెందిన పి. అరవింద్ మంగళవారం ఉదయం హాస్టల్ గదిలో విగతజీవుడై కనిపించడంతో.. తోటి విద్యార్థులు షాకయ్యారు. వెంటనే హాస్టల్, కాలేజీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. కాలేజీ యాజమాన్యం సమాచారంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు అరవింద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు తరలించారు.


Also Read : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!

మృతుడు బుచ్చా అరవింద్ స్వస్థలం సిద్ధిపేట జిల్లా బందర్ పల్లి. అరవింద్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారమిచ్చారు. అరవింద్ చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్నాడా ? ఇతర కారణాలేవైనా ఉన్నాయా ? సూసైడ్ కు ముందు నోట్ ఏమైనా రాశాడా ? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చదువు ఒత్తిడి భరించలేక పలువురు విద్యార్థులు హాస్టల్ లోనే సూసైడ్ చేసుకున్నారు.


ఇటీవల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనూ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలలుగా మానసిక వేదనతో ఉన్న ఆమె.. తన చావుకెవరూ బాధ్యులు కాదని నోట్ రాసి సూసైడ్ చేసుకుంది.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×