BigTV English

Insurance Claim: ఇన్సూరెన్సు సగం కట్టి మానేస్తే.. డబ్బులు తిరిగి ఇస్తారా? ఏం చెయ్యాలి?

Insurance Claim: ఇన్సూరెన్సు సగం కట్టి మానేస్తే.. డబ్బులు తిరిగి ఇస్తారా? ఏం చెయ్యాలి?

ఇన్సూరెన్స్ పాలసీలు ఆపద వచ్చినప్పుడు మనల్ని లేదా మన కుటుంబాల్ని ఆదుకుంటాయి. పాలసీ ఎంతవరకు ప్రయోజనకరం అనేది బీమా పాలసీ రకం, ప్రీమియం, బీమా కంపెనీ.. ఇలా చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే బీమా పాలసీకి ప్రీమియం చెల్లించలేక మధ్యలో వద్దు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? చాలామందికి ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. కొంతమంది పాలసీ చెల్లించలేక మధ్యలో వద్దు అనుకుని అసలు దాని గురించే మరచిపోతుంటారు. అలాంటప్పుడు వారికి జరిగే నష్టం ఏంటి? ఎంత?


మినహాయింపు..
బీమా పాలసీలు తీసుకునేటప్పుడే టర్మ్స్ అండ్ కంషన్స్ ని మనకి ఏజెంట్ వివరించాలి. అయితే చాలామంది బీమా తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు చెబుతారు కానీ, మధ్యలో మానేస్తే వచ్చే నష్టాల గురించి మాత్రం చెప్పరు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. బీమా పాలసీ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు విని మనం ప్రీమియం చెల్లించడం మొదలు పెడతాం. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా, ప్రీమియం ఎక్కువ ఉన్న పాలసీల విషయంలో ఇలాంటి ఇబ్బందులు తరచూ తలెత్తుతాయి. రెండు మూడు ప్రీమియంలు కట్టిన తర్వాత మనం ఉదాసీనంగా ఉన్నా, లేక మనం ఇబ్బందుల్లో ఉన్నా పాలసీ నిలిచిపోతుంది. దాని నుంచి వచ్చే ప్రతిఫలం రాకపోగా.. మనం కట్టిన డబ్బులు కూడా వెనక్కి తీసుకోలేం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా పూర్తిగా మనం కట్టిన డబ్బు వెనక్కి రాదు. అందులో కొంత బీమా కంపెనీ మినహాయించుకుంటుంది.

బీమా పాలసీనిబట్టి..
బీమా పాలసీ ప్రీమియంలను సగం కట్టేసి మానేస్తే ఏం జరుగుతుంది..? ఇది మనం తీసుకునే పాలసీ రకంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లైఫ్ ఇన్సురెన్సు పాలసీలు తీసుకుంటే.. దానిలో మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు సరెండర్ విలువను కూడా పొందుపరుస్తారు. అంటే పదేళ్ల కాలానికి మనం పాలసీ తీసుకుంటే.. పదేళ్ల తర్వాత వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ని ముందుగానే మనకు చెబుతారు. అదే సమయంలో పాలసీ ప్రీమియం కట్టడం మానేస్తే మనకి ఇచ్చే సరెండర్ విలువ ఎంత అనేది కూడా ముందుగానే నిబంధనల్లో పొందుపరుస్తారు. అయితే ఈ సరెండర్ విలువ రెండు రకాలుగా ఉంటుంది. ప్రీమియం డబ్బులు రెండు లేదా మూడేళ్లు క్రమం తప్పకుండా కడితే సరెండర్ విలువ పూర్తిగా మనకు లభిస్తుంది. కనీసం ఏడాది కూడా ప్రీమియం సరిగా కట్టకుండా వదిలేస్తే.. మనం కట్టిన డబ్బులో చాలా వరకు బీమా కంపెనీ మినహాయించుకుని మిగతాది మనకు ఇస్తుంది. ఈ సరెండర్ విలువ పాలసీ రకాన్ని బట్టి 30 శాతం నుంచి 70శాతం వరకు ఉంటుంది.


హెల్త్ పాలసీ
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఇలాంటి సరెండర్ అమౌంట్ దాదాపుగా ఉండదు. పాలసీ తీసుకున్న 15రోజుల లోపు(దీన్ని ప్రీలుక్ పీరియడ్ గా పరిగణిస్తారు) మనం దాన్ని రద్దు చేసుకుంటే పన్నులు మినహా మిగతా సొమ్ము తిరిగి ఇస్తారు. లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్, లేదా జనరల్ ఇన్సూరెన్స్ లో తిరిగి వచ్చేది ఏమీ ఉండదు.

టర్మ్ పాలసీ..
రిటర్న్స్ ఏమీ ఉండని టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా సరెండర్ వేల్యూ వంటివి ఉండవు. అందుకే టర్మ్ పాలసీలను ఎక్కువగా ఏడాదికి ఒక్క ప్రీమియంతో ముడిపెడతారు. తక్కువ సందర్భాల్లో మాత్రమే మూడు నెలలు, ఆరు నెలలు వంటి ఆప్షన్లు ఇస్తారు. ఒకసారి ప్రీమియం కడితే ఏడాది అంతా కవరేజ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రీమియం చెల్లించకపోతే అది లాప్స్ అయినట్టు పరిగణిస్తారు. పాలసీ లాప్స్ కాకుండా ఉండాలంటే తిరిగి ప్రీమియం చెల్లించి అప్పట్నుంచి దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ప్యూర్ టర్మ్ పాలసీల్లో బీమా కంపెనీలనుంచి మనకి ముందస్తుగా తిరిగి వచ్చేది ఏమీ ఉండదు.

Related News

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Today Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్

Jio Special Offers: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!

Big Stories

×