పాకిస్తాన్ లో విమాన ప్రయాణం గురించి తరచుగా సోషల్ మీడియాలో జోకులు పేలుతుంటాయి. తాజాగా జరిగిన ఘటన గురించి తెలిస్తే.. షాక్ కావడంతో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం. తాజాగా లాహోర్ నుంచి కరాచీకి వెళ్లాల్సిన ఓ పాకిస్తానీ వ్యక్తి పొరపాటున జెడ్డా విమానం ఎక్కి సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇది విమాన భద్రతతో పాటు ప్రొటోకాల్ గురించి తీవ్రమైన ఆందోళన కలిగించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మాలిక్ షాజైన్ అహ్మద్ అనే ప్రయాణీకుడు జూలై 8న ప్రైవేట్ క్యారియర్ ఎయిర్ సియల్ ద్వారా లాహోర్ నుంచి కరాచీకి వెళ్లాలి. కానీ, లాహోర్ విమానాశ్రయంలో ఆయన పొరపాటుగా మరో విమానం ఎక్కాడు. సుమారు 2 గంటల తర్వాత అతడు తాను ఎక్కిన విమానం కరాచీకి వెళ్లడం లేదని గుర్తించాడు. “సుమారు 2 గంటల తర్వాత నాకు అనుమానం వచ్చింది. నేను ఎక్కిన విమానం త్వరలో లాండ్ అయ్యేలా కనిపించడం లేదు. అప్పుడే నేను పొరపాటున మరో విమానం ఎక్కానని గుర్తించాను” అని అహ్మద్ వెల్లడించారు.
అహ్మద్ ను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
అటు జెడ్డాకు చేరుకున్న తర్వాత సౌదీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అహ్మద్ కు అంతర్జాతీయ ప్రయాణానికి అవసరమైన పాస్ పోర్టు లేదని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత అతడిని తిరిగి లాహోర్ కు పంపించారు. అయితే, ఎయిర్ సియల్ అహ్మద్ ను కరాచీకి పంపించేందుకు ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించలేదు. “నేను తప్పుగా విమానం ఎక్కడానికి కారణం అయిన ఎయిర్ సియల్ తనను టికెట్ కొనుగోలు చేయాలని చెప్పింది. తప్పు వారిది. నన్ను టికెట్ కొనుగోలు చేయమని చెప్పడం దారుణం” అన్నారు.
Read Also: ఈ రోజు నుంచి రైల్వే రూల్స్ మారాయ్.. టికెట్ బుకింగ్స్ లో భారీ మార్పులు!
ఎయిర్ సియల్ పై భారీ జరిమానాకు సిఫార్సు!
అటు ఈ ఘటనపై పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ(PAA) ఈ ఘటనను కన్ఫర్మ్ చేసింది. ఈ ఘటనకు కారణం ఎయిర్ సియల్ అన్నారు. ఈ మేరకు PAA ప్రతినిధి సైఫుల్లా పౌర విమానయాన అథారిటీ (CAA)కి ఒక నివేదిక సమర్పించింది. తీవ్రమైన తప్పిదానికి కారణమైన ఎయిర్ సియల్ పై భారీ జరిమానా విధించాలని కోరారు. అంతేకాదు, అహ్మద్ పాస్ పోర్ట్ లేకుండా లాహోర్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ను ఎలా క్లియర్ చేయగలిగాడు అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటన ప్రస్తుత విమానాశ్రయ ప్రోటోకాల్స్ ను, ఇమ్మిగ్రేషన్ తనిఖీలలో లోపాలను ఎత్తి చూపించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి భద్రత, ధృవీకరణ చర్యలను మరింత కఠినతరం చేస్తామని PAA వెల్లడించింది. సౌదీ అధికారులు పరిస్థితిని కూల్ గా డీల్ చేయకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారేదన్నారు. తీవ్రమైన దౌత్య, చట్టపరమైన పరిణామాలకు దారితీసేదన్నారు. నిర్లక్ష్యానికి ఈ ఘటన ఓ ఉదాహారణగా నిలిచిందని ఎయిర్ పోర్టు అథారిటీ అభిప్రాయపడింది.
Read Also: అబ్బ.. ఈ రైలు వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖకు గంటలోనే!