BigTV English

Genelia : ఎన్టీఆర్ చేసిన ఆ పనికి షాక్ అయ్యాను, ఎన్టీఆర్ లో ఇంత ఉందా.?

Genelia : ఎన్టీఆర్ చేసిన ఆ పనికి షాక్ అయ్యాను, ఎన్టీఆర్ లో ఇంత ఉందా.?

Genelia : జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాత హాసిని పాత్ర చాలామందికి విపరీతంగా గుర్తుండిపోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ పాత్రను అంత అద్భుతంగా రాశాడు. హాసినిలాంటి అమ్మాయి మన జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది అనే అంతలా ఉంటుంది ఆ పాత్ర. ఇప్పటికి జెనీలియా ఎన్ని సినిమాలు చేసినా కూడా హాసిని పాత్ర అంటేనే ఒక ప్రత్యేకత.


తెలుగులో చాలామంది హీరోలతో జెనీలియా వర్క్ చేశారు. సిద్ధార్థ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో నటించింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో కూడా జెనీలియా పాత్ర చాలా బాగుంటుంది. అయితే అప్పట్లో ఆ పాత్ర సినిమాకే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు.

ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అయ్యాను 


ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ తో కలిసి సాంబా అనే సినిమాలో నటించింది జెనిలియా. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ టాలెంట్ గురించి మరోసారి తన మాటల్లో చెప్పుకొచ్చింది జెనీలియా. ఎన్టీఆర్ మూడు పేజీల డైలాగ్ ను చదివేసిన తర్వాత నేను రెడీ అని చెప్తారు. ఆయన మూడు పేజీలు డైలాగులు ఒకసారి చూసిన తర్వాత రెడీ అన్నారు అంటే ఆయనకున్న టాలెంట్ చూసి నేను షాక్ అయిపోయాను అంటూ తెలిపారు. ఎన్టీఆర్ డైలాగులను ఎంత బాగా చెబుతారు తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. టెంపర్ వంటి సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అండ్ డైలాగ్స్ వల్లనే సినిమా ఆ స్థాయిలో హిట్ అయింది.

జూనియర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు 

రానా హీరోగా 2012లో వచ్చిన నా ఇష్టం సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది జెనీలియా ఆ తర్వాత తెలుగు సినిమాలకు కంప్లీట్ గా దూరం అయిపోయారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి నటిస్తున్న జూనియర్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది జెనీలియా. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది. మళ్లీ చాలా ఏళ్లు తర్వాత తెలుగు ప్రేక్షకులకు జూనియర్ సినిమాతో దగ్గరవుతుంది. అయితే ఏ మాటకి ఆ మాటగా చెప్పుకోవాలి అంటే, జెనీలియా అప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే బ్యూటీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో ఈ సినిమా ఫలితం మీద డిపెండ్ అయి ఉండొచ్చు.

Also Read : Bollywood Ramayana : రామయణ రాసింది బాలీవుడ్ వాడా ? ఏంటి తిక్క తిక్కగా ఉందా ?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×