E-Paper
Advertisement

బంగారు నగలను”గులాబీ రంగు కాగితం”లోనే ఎందుకు ప్యాక్ చేస్తారో తెలుసా?

బంగారు నగలను”గులాబీ రంగు కాగితం”లోనే ఎందుకు ప్యాక్ చేస్తారో తెలుసా?
Advertisement

Why jewellers use pink paper: మనం ఎప్పుడైనా బంగారు నగలు కొన్నప్పుడు లేదా రిపేర్ చేయించుకున్నప్పుడు, జ్యువెలరీ షాపు వారు ఆ నగలను ఒక ప్రత్యేకమైన గులాబీ రంగు కాగితంలో జాగ్రత్తగా మడిచి ఇస్తారు. చిన్న ఉంగరం అయినా, పెద్ద హారం అయినా కచ్చితంగా ఆ పింక్ పేపర్ ఉండాల్సిందే. అసలు తెలుపు, పసుపు, ఆకుపచ్చ వంటి ఎన్నో రంగులు ఉండగా షాపు వాళ్లు కేవలం గులాబీ రంగు కాగితాన్నే ఎందుకు వాడతారు? దీని వెనక ఏదైనా వ్యాపార రహస్యం ఉందా లేక శాస్త్రీయ కారణం ఉందా? ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన నిజాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. బంగారం మెరుపు:

దీని వెనక ఉన్న ప్రధాన కారణం కలర్ సైన్స్. బంగారం సహజంగానే పసుపు-బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. ఆ బంగారాన్ని తెలుపు రంగు కాగితంలో.. పెడితే దాని మెరుపు అంతగా ఎలివేట్ కాదు, కొన్నిసార్లు కాస్త వెలసిపోయినట్లు కనిపిస్తుంది. అదే గులాబీ రంగు కాగితంపై బంగారాన్ని ఉంచినప్పుడు, ఆ రంగు కాంట్రాస్ట్ వల్ల బంగారం మరింత ప్రకాశవంతంగా, స్వచ్ఛంగా, కొత్తగా మెరిసి పోతూ కంటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కస్టమర్లు నగను చూడగానే ఆకర్షితులవ్వడానికి ఇది ఒక అద్భుతమైన విజువల్ ట్రిక్.

2. సెంటిమెంట్, లక్ష్మీదేవికి ప్రతీక:

Advertisement

మన  సంస్కృతిలో గులాబీ రంగును శుభ ప్రదంగా, ఐశ్వర్యానికి, లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీ దేవి కూర్చునే కమలం (తామర పువ్వు) గులాబీ రంగులో ఉంటుంది. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాం కాబట్టి, నగలను గులాబీ రంగు కాగితంలో ఉంచితే శుభం కలుగుతుందని, ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని తర తరాలుగా ఒక బల మైన నమ్మకం ఉంది.

3. గీతలు పడకుండా ఉండే ప్రత్యేకమైన టిష్యూ:

బంగారు పని వారు వాడే ఈ గులాబీ రంగు కాగితం సాధారణ కాగితం కాదు. ఇది చాలా మృదువుగా ఉండే ప్రత్యేక మైన మైనపు లేదా బటర్-టిష్యూ తరహా పేపర్. 22 క్యారెట్ల బంగారం చాలా సున్నితంగా ఉంటుంది. గట్టి కాగితంలో చుడితే నగలకు చిన్న చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. ఈ మృదువైన పింక్ పేపర్ నగలపై ఎలాంటి గీతలు పడకుండా రక్షిస్తుంది. అంతే కాకుండా గాలిలోని తేమ తగలకుండా ఉంచి, బంగారం త్వరగా నల్ల బడకుండా కాపాడుతుంది.

4. కచ్చితత్వం:

Advertisement

బంగారం ధర గ్రాముల్లో ఉంటుంది కాబట్టి, ఒక్క మిల్లీగ్రాము తేడా వచ్చినా ధరలో మార్పు వస్తుంది. ఈ గులాబీ రంగు కాగితాలు అన్నీ ఒకే నిర్దిష్టమైన బరువుతో తయారవుతాయి. దీని వల్ల బంగారు పని వారు నగలను తూకం వేసేటప్పుడు కాగితం బరువును ఈజీగా లెక్కించి, కచ్చితమైన బంగారం బరువును కస్టమర్లకు చూపించగలుగుతారు.

Related News

బిస్లెరీ నీరు తాగొచ్చా? వద్దా? FSSAI నివేదికపై బిస్లెరీ సంస్థ ఏం చెప్పిందంటే?

ఉక్కు రంగంలో భారీ ఒప్పందం.. ఏపీఎల్ అపోలో చేతికి టాటా స్టీల్ కీలక విభాగాలు.. డీల్ విలువ ఎంతంటే?

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయాయి? ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలివే

బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!

లీటర్ పాలు రూ.7,000.. పాల పౌడర్ కిలో రూ.80,000.. పాడి రైతులకు బంగారు పంట

బ్యాంక్ లాకర్‌లోని నగలు, డబ్బు ఎవరైనా దొంగిలిస్తే..ఎంత పరిహారం వస్తుంది?

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్.. ఇక కాసుల పంటే, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×