E-Paper
Advertisement

ప్లేట్లు కడిగే కుర్రాడు… కట్ చేస్తే ప్రపంచాన్నే ఏలిన చెఫ్… ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ బయోపిక్

ప్లేట్లు కడిగే కుర్రాడు… కట్ చేస్తే ప్రపంచాన్నే ఏలిన చెఫ్… ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ బయోపిక్
Advertisement

Anthony Bourdain Biopic on OTT: సాధారణంగా బయోపిక్ సినిమాలంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగిన జీవిత చరిత్రను చూపిస్తుంటాయి. అయితే ఒక లెజెండరీ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన కేవలం ఒక్క వేసవి కాలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాత చెఫ్, రచయిత, టీవీ హోస్ట్ దివంగత ఆంథోనీ బౌర్డెయిన్ (Anthony Bourdain) జీవితం ఆధారంగా రూపొందిన సూపర్ హిట్ బయోపిక్ డ్రామా ‘టోనీ’ (Tony) ఇప్పుడు డిజిటల్ తెరపైకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఈ సినిమా. ఒక ప్లేట్లు కడిగే కుర్రాడు ప్రపంచాన్నే ఏలిన స్టార్ చెఫ్‌గా ఎలా మారాడు ? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఈ రియల్ స్టోరీ ఏమిటంటే ?

ఈ సినిమా కథంతా 1975వ సంవత్సరం వేసవిలో, 19 ఏళ్ల యువకుడు ఆంథోనీ అలియాస్ టోనీ (డొమినిక్ సెస్సా) జీవితం చుట్టూ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. కాలేజీలో చదువుతూ గొప్ప రచయిత కావాలని కలలు కనే టోనీ, తనకు రైటింగ్ ఫెలోషిప్ వచ్చిందని ఇంట్లో అబద్ధం చెప్పి, తాను ప్రేమించిన నాన్సీ (ఎమిలియా జోన్స్) కోసం మసాచుసెట్స్‌లోని ప్రోవిన్స్‌టౌన్ అనే సముద్ర తీర ప్రాంత పట్టణానికి వెళ్తాడు. అయితే చేతిలో డబ్బులు లేక, ఉండటానికి చోటు లేక రోడ్డున పడిన టోనీ, చివరికి అక్కడి ‘ది ఫ్లాగ్‌షిప్’ (The Flagship) అనే ఒక రెస్టారెంట్‌లో ప్లేట్లు కడిగే కుర్రాడిగా (డిష్ వాషర్‌గా) పనికి కుదురుతాడు.

Advertisement

ఆ రెస్టారెంట్ యజమాని (ఆంటోనియో బాండెరాస్) బయటకు ఎంతో కఠినంగా కనిపిస్తూనే, వంటల పట్ల అపారమైన ప్రేమ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. వంటగదిలోని గందరగోళం, తోటి కుక్ లతో స్నేహం, చెఫ్ దగ్గర నేర్చుకున్న పాఠాలు టోనీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రచయిత కావాలనుకున్న ఆ కుర్రాడికి వంటల పట్ల ఉన్న ఆసక్తి ఎలా బయటపడింది? ఆ ఒక్క వేసవి అతడిని ప్రపంచ స్థాయి చెఫ్‌గా ఎలా మార్చిందనేది ఇందులో అద్భుతంగా చూపించారు. లైఫ్-ఛేంజింగ్ డ్రామాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.

ఓటీటీ విషయానికి వస్తే..

ప్రముఖ స్టూడియో A24 నిర్మించిన ‘టోనీ’ (Tony) మూవీలో యంగ్ సెన్సేషన్ డొమినిక్ సెస్సా (Dominic Sessa) యువకుడైన ఆంథోనీ బౌర్డెయిన్‌గా అద్భుతంగా నటించగా, హాలీవుడ్ స్టార్ ఆంటోనియో బాండెరాస్ (Antonio Banderas), ఎమిలియా జోన్స్ (Emilia Jones), లియో వుడాల్ (Leo Woodall) కీలక పాత్రలు పోషించారు. దీనికి మాట్ జాన్సన్ (Matt Johnson) దర్శకత్వం వహించారు. ఆంథోనీ బౌర్డెయిన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘కిచెన్ కాన్ఫిడెన్షియల్’ ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ హెచ్‌బీఓ మ్యాక్స్ (HBO Max) వేదికగా 2026 నవంబర్ 20 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి వచ్చింది. రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 93 శాతం రేటింగ్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇంగ్లీష్ (English) ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: కొడుకు శవానికి అంత్యక్రియలు చేయలేని తల్లి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ డ్రామా

Tags

Related News

ఒక్కరోజు పెరోల్, రెండు మిస్టరీ హత్యల కేసు… ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్

టిఫిన్ డెలివరీ బాయ్ నుండి వైరల్ యూట్యూబర్ వరకు… చూస్తే ఒక్క ఎపిసోడ్ కూడా వదలరు

This Week OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

చిరు మెగావర్స్ టాక్  షో ముహూర్తం పిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్

గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

Big Stories

Advertisement
×