Bisleri Water: ప్రముఖ డ్రింకింగ్ వాటర్ తయారీ సంస్థ బిస్లెరీ (Bisleri International)కి భారత ఆహార భద్రతా సంస్థ (FSSAI) గట్టి షాకిచ్చింది. ఆ సంస్థ తయారు చేస్తున్న నీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో విచారణకు ఆదేశించింది. బిస్లెరీతో పాటు ఆహార భద్రతా నియమాలు పాటించని పలు సంస్థలపై కూడా లైసెన్సుల రద్దు, ఉత్పత్తుల ఉపసంహరణ వంటి కఠిన చర్యలను ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకుంది.
బిస్లెరీ ఇంటర్నేషనల్ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను తొలుత ఎఫ్ఎస్ఎస్ఏఐ పరీక్షించింది. అందులో బ్రోమేట్ (Bromate) పరిమితి ఉన్నట్లు ల్యాబ్ టెస్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో బిస్లెరీ నీటిని తాగడం మంచిది కాదని అధికారులు ప్రకటించారు. ఆ నీరు తాగడానికి సురక్షితం కాదని స్పష్టం చేశారు.
అయితే ఈ ల్యాబ్ ఫలితాలపై సదరు కంపెనీ అప్పీల్ కు వెళ్లడంతో మరో ల్యాబ్ లోనూ నీటిని పరీక్షించారు. అక్కడ కూడా నీరు తాగడానికి సురక్షితం కాదని తేలింది. అంతేకాకుండా ఈ దఫా పరీక్షల్లో అందులో ‘పాలీ న్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (Polynuclear aromatic hydrocarbons) ఉన్నట్లు కూడా బయటపడింది. ఈ రెండు కెమికల్స్ క్యాన్సర్ కారకాలు కావడంతో బిస్లెరీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!
మరోవైపు ఆశా కన్ఫెక్షనరీ సంస్థ తయారు చేసిన ప్యాక్ చేసిన చాక్లెట్ ఫిల్డ్ కుకీస్ లోనూ నాణ్యతా ప్రమాణాలు లోపించాయి. దీంతో నాణ్యత లేని సదరు బ్యాచ్ కు సంబంధించిన ఉత్పత్తులను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఆశా కన్ఫెక్షనరీ కుకీస్ ను ల్యాబ్ పరీక్షంచగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్యాకెట్ లేబుల్ పై ప్రస్తావించని ‘కార్మోసిన్’ అనే రంగును వీటి తయారీలో వాడినట్లు బయటపడింది. ‘టార్ట్రాజైన్’ (Tartrazine) అనే పదార్థం పరిమితికి మించి ఉండటంతో పాటు.. ‘సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్’ రంగునను కలిపినట్లు నిర్దారణ అయ్యింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిస్లెరీ నీటిని పెద్ద ఎత్తున ప్రజలు వినియోగిస్తున్నారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు, కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్లు ఇలా ఎక్కడ చూసిన వీటి విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. బయటకు వచ్చిన సందర్భాల్లో చాలా మంది ఈ ప్యాకింగ్ వాటర్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో తాజా పరిణామం ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఏకంగా క్యాన్సర్ కారకాలు ఆ నీటిలో ఉన్నట్లు బయటపడటం మరింత భయాందోళనలు సృష్టిస్తోంది.
Also Read: ప్రేమ కోసం ఖరీదైన బహుమతులు అవసరం లేదు.. ఈ చిన్న పనులు చేస్తే చాలంటున్న జెన్ Z