E-Paper
Advertisement

బ్యాంక్ లాకర్‌లోని నగలు, డబ్బు ఎవరైనా దొంగిలిస్తే..ఎంత పరిహారం వస్తుంది?

బ్యాంక్ లాకర్‌లోని నగలు, డబ్బు ఎవరైనా దొంగిలిస్తే..ఎంత పరిహారం వస్తుంది?
Advertisement

Bank locker theft compensation RBI rules: ఇంట్లో బంగారం, విలువైన డాక్యుమెంట్లు ఉంచితే.. దొంగల భయం ఉంటుందని చాలా మంది బ్యాంక్ లాకర్లను వాడతారు. కానీ.. ఎక్కువ సేఫ్టీ ఉండే బ్యాంక్ లాకర్ల నుంచే నగలు మాయమైతే పరిస్థితి ఏంటి? మీ రూ.20 లక్షల విలువచేసే బంగారం పోతే బ్యాంక్ పూర్తి డబ్బు తిరిగి ఇస్తుందా? దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అసలు దొంగతనం జరిగితే ఎంత పరిహారం వస్తుంది? బ్యాంక్ బాధ్యత ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.)

అసలు పరిహారం ఎంత వస్తుంది? :

చాలా మంది అనుకునేది ఏంటంటే.. లాకర్‌లో ఎంత విలువైన బంగారం ఉంటే అంత డబ్బు బ్యాంక్ ఇస్తుందని. కానీ, ఇది నిజం కాదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా లోపం వల్ల లాకర్‌లోని వస్తువులు పోతే, మీ లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు బ్యాంక్ పరిహారంగా చెల్లిస్తుంది.

బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె & పరిహారం:

Advertisement

బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రాంతం (గ్రామీణ, పట్టణ, మెట్రో నగరాలు), లాకర్ సైజును బట్టి వార్షిక అద్దె మారుతుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో లాకర్ ధరలు, వాటిపై వచ్చే గరిష్ట పరిహారం ఇలా ఉంటుంది:.

చిన్న లాకర్ (Small Locker): వార్షిక అద్దె సుమారు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. దొంగతనం జరిగితే మీకు రూ.1,50,000 నుంచి రూ.3,00,000 వరకు పరిహారం అందుతుంది.

Advertisement

మీడియం లాకర్ (Medium Locker): వార్షిక అద్దె సుమారు రూ.3,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దీనికి పరిహారంగా రూ.3,00,000 నుంచి రూ. 6,00,000 వరకు లభిస్తుంది.

పెద్ద లాకర్ (Large Locker): వార్షిక అద్దె సుమారు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. ఈ కేటగిరీలో రూ.6,00,000 నుంచి రూ.12,00,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

అతిపెద్ద లాకర్ (Extra Large): మెట్రో నగరాల్లో దీని అద్దె రూ.15,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది. దీనికి గరిష్టంగా రూ.15 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

(గమనిక: ఈ ధరలకు అదనంగా 18% GST వర్తిస్తుంది, కానీ పరిహారం మాత్రం కేవలం బేస్ అద్దెపైనే లెక్కిస్తారు).

ఏ సందర్భాల్లో బ్యాంక్ పరిహారం చెల్లించాలి?

బ్యాంక్ భద్రతాలోపం వల్ల జరిగే దొంగతనం లేదా దోపిడీ.

బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల జరిగే అగ్నిప్రమాదం లేదా భవనం కూలిపోవడం.

బ్యాంక్ ఉద్యోగులే స్వయంగా చేసే మోసాలు .

బ్యాంక్ ఎప్పుడు బాధ్యత వహించదు?

భూకంపాలు, వరదలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌కు నష్టం జరిగితే బ్యాంక్ ఎలాంటి పరిహారం ఇవ్వదు. అలాగే, ఖాతాదారుడు లాకర్ తాళం సరిగ్గా వేయకపోవడం లేదా తాళం చెవి పోగొట్టుకోవడం వంటి సొంత నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత వహించదు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1.ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లాకర్‌లోని వస్తువులకు ఇన్సూరెన్స్ ఇవ్వవు. కాబట్టి, మీరు విడిగా హోమ్ ఇన్సూరెన్స్ లేదా జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్.

2.మీరు లాకర్ ఆపరేట్ చేసిన ప్రతి సారీ బ్యాంక్ నుంచి SMS,ఇమెయిల్ అలర్ట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి.

3.ఒకవేళ మీ నగల విలువ పరిహారం కంటే చాలా ఎక్కువగా ఉండి, బ్యాంక్ తీవ్ర నిర్లక్ష్యం నిరూపితమైతే, మీరు వినియోగదారుల కమిషన్ లేదా సివిల్ కోర్టును ఆశ్రయించి పూర్తి విలువ కోసం పోరాడొచ్చు.

Related News

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్.. ఇక కాసుల పంటే, ఇంకెందుకు ఆలస్యం

ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?

మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

క్లెయిమ్‌ల తిరస్కరణ, అక్రమ కోతలపై .. స్టార్ హెల్త్‌కు రూ. 2 కోట్ల జరిమానా!

పెట్టుబడిదారుడు చనిపోతే అతని మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి ఎవరికి వర్తిస్తాయి?.. నామినీ, నిబంధనలు ఇవే

నర్సు ఉద్యోగానికి గుడ్ బై.. 7 నెలల్లోనే రూ.1.75 కోట్ల సంపాదన.. కంటెంట్ క్రియేషన్ పవర్ అంటే ఇదీ!

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

Big Stories

Advertisement
×