E-Paper
Advertisement

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయాయి? ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలివే

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయాయి? ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలివే
Advertisement

Gold Price Fall| ఒకప్పుడు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ తగ్గుదల ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు 10 నెలల క్రితం వరకు రూ.1,80,000 వరకు (24 క్యారెట్ బంగారం )రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు ఏకంగా 30 శాతానికి పైగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తులం బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. అయితే, ఈ ధరల పతనానికి కారణాలేంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? మళ్లీ పుంజుకుంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా ఈ అనూహ్య మార్పునకు కారణాలు అర్థం చేసుకోవాలి.

బంగారం ధరలు ఎంత వరకు తగ్గాయి?

నవంబర్ 20, 2026న వెల్లడైన MCX స్పాట్ డేటా ప్రకారం.. బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గతంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,76,306కు చేరింది. ప్రస్తుతం అది రూ.1,23,077కు తగ్గింది. అంటే 10 గ్రాములపై ఏకంగా రూ.53,229 తగ్గింది. గరిష్ఠ ధరతో పోలిస్తే ఇది 30.19 శాతం పతనం.

బంగారం ధరలు తగ్గడానికి 3 ప్రధాన కారణాలు

1. ధరలు భారీగా పెరగడంతో లాభాలు తీసుకుంటున్న పెట్టుబడిదారులు

Advertisement

గతంలో బంగారం ధరలు వేగంగా పెరగడంతో చాలామంది పెట్టుబడులు చేశారు. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ధరలు భారీగా పెరగడంతో కొందరు పెట్టుబడిదారులు తమ లాభాలను ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో పెట్టుబడిదారులు బంగారాన్ని విక్రయిస్తున్నారు. మార్కెట్లో అమ్మకాలు ఎక్కువైతే ధరలు సహజంగానే తగ్గే అవకాశం ఉంటుంది.

2. తగ్గిన అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం

యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. చాలామంది పెట్టుబడిదారులు తమ డబ్బు కాపాడుకోవడానికి బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో వేలు, లక్షల టన్నుల్లో బంగారం కొనుగోలు జరుగుతుంది. ధరలు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు కొంత స్థిరపడిన కారణంగా కొనుగోళ్లు తగ్గాయి. కొనుగోళ్లు తగ్గడంతో బంగారం డిమాండ్ కూడా తగ్గింది. అందుకే ధరలు తగ్గుముఖం పట్టాయి.

3. పెరిగిన అమెరికా బాండ్లపై వడ్డీ రాబడి

Advertisement

బంగారం కొనుగోలు చేస్తే సాధారణంగా వడ్డీ ఆదాయం లభించదు. కానీ అమెరికా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే వడ్డీ వస్తుంది. బాండ్లపై రాబడి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి బదులుగా వాటిని ఎంచుకుంటారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. అమెరికా డాలర్ విలువ, రూపాయి మారకం రేటు కూడా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

ధరలు తగ్గుతున్నా బంగారంపై కొనసాగుతున్న ఆసక్తి

బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ చాలామంది ఇప్పటికీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడుల విభజన కోసం బంగారాన్ని ఎంచుకునేవారు ఉన్నారు. ఆభరణాలు, నాణేలు, బంగారు కడ్డీలు, గోల్డ్ ETFల ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ధరలు మరింత తగ్గవచ్చని భావించి చాలామంది కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారు.

Also Read: పెట్టుబడిదారుడు చనిపోతే అతని మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి ఎవరికి వర్తిస్తాయి?.. నామినీ, నిబంధనలు ఇవే 

ఇప్పుడు పెట్టుబడిదారులు ఏం చేయాలి?

ధరలు తగ్గాయని వెంటనే మొత్తం డబ్బును బంగారంలో పెట్టకూడదు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్‌ పరిశీలించాలి. కొత్తగా కొనాలనుకునేవారు ఒకేసారి కాకుండా విడతలవారీగా కొనుగోలు చేయవచ్చు. అయితే, దీనివల్ల నష్టాల ప్రమాదం పూర్తిగా తొలగిపోదు.

Also Read: మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా?

బంగారం ధరలు తిరిగి పెరుగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేం. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, అంతర్జాతీయ పరిస్థితులు, బంగారానికి ఉన్న డిమాండ్‌పై ధరలు ఆధారపడతాయి. ధరలు తగ్గాయని కొనుగోలు చేయడం లాభదాయకమని హామీ లేదు. ఎందుకంటే ఇంకా ఎంత తగ్గుతాయని చెప్పలేం. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక నిపుణుల ప్రకారం.. భారీగా కొనుగోళ్లు చేయకుండా ప్రతి నెలా చిన్న మొత్తాల్లో కొనడం బెటర్.

Related News

బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!

లీటర్ పాలు రూ.7,000.. పాల పౌడర్ కిలో రూ.80,000.. పాడి రైతులకు బంగారు పంట

బ్యాంక్ లాకర్‌లోని నగలు, డబ్బు ఎవరైనా దొంగిలిస్తే..ఎంత పరిహారం వస్తుంది?

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్.. ఇక కాసుల పంటే, ఇంకెందుకు ఆలస్యం

ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?

మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

క్లెయిమ్‌ల తిరస్కరణ, అక్రమ కోతలపై .. స్టార్ హెల్త్‌కు రూ. 2 కోట్ల జరిమానా!

Big Stories

Advertisement
×