Yamaha FZ-S Fi Hybrid Bike: యమహా బైక్‌ల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే యూత్ అతిగా ఇష్టపడే బైక్‌లో యమహాదే ఫస్ట్ ప్లేస్. బైక్ స్టయిల్, పికప్ ఇలా ఏది చూసినా యమహాని ఇష్టపడివారు ఉండరు. లేటెస్ట్‌గా యమహా హైబ్రిడ్ (పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్) టెక్నాలజీని బైక్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. FZ-S Fi పేరిట మోటార్ బైక్‌ను తీసుకొచ్చింది.
యమహా హైబ్రిక్ బైక్
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫై(FZ-S Fi) పేరిట సోమవారం హైబ్రిడ్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 1.45 లక్షలు. దేశంలో 150 సీసీ విభాగంలో హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి బైక్ FZ-S Fi. యమహా FZ-S Fi హైబ్రిడ్ మోటార్ బైక్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. మెరుగైన హెడ్ లైట్లు, పెద్ద ఇంధన ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్‌లను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇంజన్ ఫీచర్స్
బైక్‌లో 149 సీసీ ఫోర్-స్ట్రోక్, టూ-వాల్వ్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,250 ఆర్బీఎమ్ వద్ద 12.4 PS హార్స్ పవర్ ఉంటుంది. అలాగే 5,500 ఆర్పీఎమ్ వద్ద 12.4 ఎన్ఎం(న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. స్లిప్పర్ క్లచ్ ఎంపికతో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగివుంది. పవర్ ట్రెయిన్ ఓబీడీ-2బీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండనుంది.
మైలేజీకి ప్రయార్టీ
యమహా బైక్‌లు అనగానే పికప్‌కు కేరాఫ్‌గా చెబుతారు. ఈసారి మైలేజీని పెంచేలా FZ-S Fi బైక్ ని తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. యమహా FZ-S Fi బైక్ పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వలన గతంలో కంటే మెరగైన పని తీరును కనపరచనుంది. ఎక్కువ మైలేజీని అందించడంలో సహాయపడునుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈసారి మైలేజీకి ఆ కంపెనీ ప్రయార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ALSO READ: బుల్లెట్ బైక్ మాదిరిగా హీరో స్ల్పెండర్ ఫ్లస్
మెయిన్ ఫీచర్స్
యమహా FZ-S Fi హైబ్రిడ్ బైక్ స్మార్ట్ మోటార్ జనరేటర్. స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ టెక్నాలజీని కలిగివుంది. ఇక ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. ఇది 4.2-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్, కాల్ అండ్ ఎస్ఎంఎస్ హెచ్చరికలు ఇవ్వనుంది. బైక్‌కి ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో ఉంటుంది.
రైడర్ల భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లకు ప్రయార్టీ ఇచ్చింది. ఈ బైక్ బరువు 138 కిలోలు, 13 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంది. ఓబీడీ-2డీ ప్రమాణాలతో పర్యావరణ హితమై ఇంజన్ కలిగి ఉంది. దేశీయంగా ఎఫ్‌జెడ్ బ్రాండ్ ఫేమస్ అయ్యింది. జనరేషన్‌కు నచ్చే విధంగా పలు మోడళ్లను రూపొందించింది. ఇదే క్రమంలో యువత ఆలోచనలకు తగ్గట్టుగా ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు కంపెనీ చైర్మన్ తెలిపారు.