Hero Splendor Plus: మీరు ఈ కొత్త ఏడాదిలో మంచి లుక్‌తోపాటు బడ్జెట్ ధరల్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా. అయితే ఓసారి ఈ వార్తపై లుక్కేయండి. ఎందుకంటే 2025లో హీరో స్ప్లెండర్ ప్లస్ కొత్త ఫీచర్లతోపాటు డిజైన్‌ను కూడా మార్చేసింది. కొత్త స్ప్లెండర్ ప్లస్ కొంచెం బుల్లెట్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తాజా మోడల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
2025 మోడల్లో ఫ్రంట్ వీల్ 240mm డిస్క్ బ్రేక్‌తో ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ స్ప్లెండర్ ప్లస్ XTEC వేరియంట్‌తో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. దీనిలో బ్రేకింగ్ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న డ్రమ్ బ్రేక్‌తో పోలిస్తే, ఈ కొత్త డిస్క్ బ్రేక్ సిస్టమ్ సురక్షితమైన, మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది. నగరంలోని ట్రాఫిక్ మధ్య లేదా హైవేలు ఉన్నప్పుడు ఈ అధిక ప్రమాణాల బ్రేకింగ్ సిస్టమ్ వాడకం అత్యంత మెరుగ్గా పనిచేస్తుంది.
2025 హీరో స్ప్లెండర్ ప్లస్ కొత్త రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. వీటిలో “కాండీ రెడ్” వంటి రంగులు ఉన్నాయి. ఈ రంగు 2000లలో విడుదలైన మోడళ్లకు ఇంచుమించు నొస్టాల్జిక్ గుర్తింపును అందిస్తుంది. దీంతోపాటు యాక్సిస్ గ్రే అనే ప్రీమియం రంగు కూడా అందుబాటులో ఉంది. ఇది తన లైన్ అప్‌కు ప్రత్యేకతను ఇచ్చేలా కనిపిస్తుంది.
Read Also: Washing Machine: రూ. 888కే బ్రాండెడ్ వాషింగ్ మిషన్.. ఐదేళ్ల వారంటీతోపాటు..
ఇంజిన్ విభాగంలో దీనిలో 97.2cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ వినియోగిస్తున్నారు. ఇది 8.02PS శక్తిని, 8.05Nm టార్క్‌ను అందిస్తుంది. దీని పరిణామం కూడా తాజా OBD2B నిబంధనలను పాటిస్తుంది. తద్వారా గాలి ఉద్గారాల నియంత్రణ మెరుగుపడుతుంది. దీని ద్వారా మోటార్ సైకిల్ విభాగంలో ఉద్గార నిరోధకతను మెరుగుపరుస్తుంది.
సస్పెన్షన్ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. ఇవి రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. బైక్ లోపలి క్వాలిటీ, సవారీకి అనువైన విధంగా సపోర్ట్ చేస్తాయి. దీంతో రైడర్‌కు సులభమైన ప్రయాణ అనుభవాన్ని ఇచ్చేందుకు సహకరిస్తాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 77,176 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడల్‌లో డిస్క్ బ్రేక్ ఎక్విప్డ్ వేరియంట్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది రూ. 80,000 ధరతో ఉండవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే హీరో స్ప్లెండర్ ప్లస్ అనేక సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రముఖ బైక్ బ్రాండుగా కొనసాగుతోంది. అయితే ఈ కొత్త ఆప్డేట్‌తో ఇది మార్కెట్లో ప్రత్యర్థి సంస్థలకు మరింతగా పోటీ ఇవ్వనుంది. ప్రధానంగా TVS Radeon, బజాజ్ ప్లాటినా 100కు మరింత కాంపిటీషన్ కానుంది. ఈ క్రమంలో హీరో స్ప్లెండర్ ప్లస్ దీని విశ్వసనీయత, ఫీచర్ ప్యాక్డ్ వేరియంట్‌తో మార్కెట్లో తన స్థాయిని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">