Zelio Ebikes: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ జెలియా ఆటో మార్కెట్‌లో తన హవా కనబరుస్తోంది. కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేస్తూ ఫీచర్లతో వాహనప్రియుల్ని ఫిదా చేస్తుంది. ఈ సంస్థ తాజాగా మరొక కొత్త ఈవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎక్స్ మెన్ సిరీస్‌లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేసింది. ఇవి తక్కువ వేగంతో ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తక్కువ వేగంతో ప్రయాణించే ఈ – స్కూటర్లు కొనుక్కుని రోడ్లపై నడిపేవారికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అలాగే వీటి ధరల విషయానికొస్తే.. ప్రారంభ ధర రూ .64,543 నుండి గరిష్టంగా రూ. 87,573 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీని మైలేజీ విషయానికొస్తే.. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 55 నుంచి 60 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది ఫుల్‌గా ఛార్జింగ్ కావడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కాగా దీని బ్యాటరీ విషయానికొస్తే.. ఎక్స్ మెన్ మిడ్ వేరియంట్ రూ.67,073ల ధరతో అందుబాటులో ఉంది. ఇది 72 వి/ 32 ఎహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 70 కి.మీ పరుగులు పెడుతుంది.
Also Read: తక్కువ ధరలో 100 కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్.. తక్కువ ఖర్చు.. మైలేజ్ అదనం!
అయితే దీనికి ఫుల్‌గా ఛార్జింగ్ చేయడానికి 7 నుంచి 9 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ ఎక్స్ మెన్ సిరీస్ టాప్ వేరియంట్ రూ.87,673 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 60 వి / 32 ఎహెయ్ లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. ఈ హై వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 80 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్‌గా ఛార్జింగ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది.
ఇకపోతే ఈ – స్కూటర్లలో శక్తివంతమైన భారీ 60/72 వి బీఎల్డీసీ మోటార్‌ను అందించారు. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. చివరిగా వీటి ఫీచర్ల విషయానికొస్తే.. జెలియో ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీ థెఫ్ట్ అలారం అందించారు. అలాగే రివర్స్ గేర్, ఆటో రిపేర్ స్విచ్, పార్కింగ్ స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు అందించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి వైట్, బ్లాక్, గ్రీన్, రెడ్.