BigTV English
Advertisement

CM Chandrababu Naidu: మారాలి.. మారి తీరాల్సిందే.. IAS, IPSలకు చంద్రబాబు స్పెషల్ క్లాస్

CM Chandrababu Naidu: మారాలి.. మారి తీరాల్సిందే.. IAS, IPSలకు చంద్రబాబు స్పెషల్ క్లాస్

చంద్రబాబు అంటేనే పర్‌ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్‌ అనే ప్రచారం ఉంది. నిజానికి పాలనపరమైన నిర్ణయాలు తీసుకునేది రాజకీయ నేతలే అయినా.. వాటిని పర్‌ఫెక్ట్‌గా అమలు చేసేది.. అవసరమైన సలహాలు ఇచ్చేది మాత్రం ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. అందుకే తాను బాధ్యతలు తీసుకున్నాక వారితో స్పెషల్‌గా భేటీ అయ్యారు. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం అనే విషయాల కన్నా.. వారికి చిన్నపాటి క్లాస్‌ తీసుకున్నారని చెప్పాలి చంద్రబాబు.. ఎందుకంటే గత పాలనలో వారు వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకున్నారు కదా.. అందుకే ఈ స్పెషల్ క్లాస్.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను వ్యవహరించిన తీరును ఆయన మర్చిపోలేదు. కొంతమంది అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు చంద్రబాబు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను గతంలో పలుసార్లు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుర్తుచేసుకున్నారు. గత ఐదేళ్ళలో తాము వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు.


అలాగే మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్‌లతో సమావేశం అవుతానని చెప్పారంట చంద్రబాబు. అంటే చంద్రబాబుకు నచ్చకపోయినంత మాత్రాన వారు తప్పు చేశారని కాదు కానీ.. ఇకముందు తన హయాంలో ఎలా నడుచుకోవాలో చంద్రబాబు ఇన్‌డైరెక్ట్‌గా సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే.. ఇప్పుడు వీరు నడుచుకునే విధానం భవిష్యత్తులో ఎవరి మనసును బాధపెడుతుందో.. సరే ఇవన్నీ కాదు కానీ.. తన కనుసన్నల్లో పనిచేసే అధికారులు మాత్రం చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్తున్నట్టు ఉంది చంద్రబాబు మాట.

నిజానికి వైసీపీ హయాంలో నిర్ణయాలు తీసుకున్నది ఆ పార్టీ పెద్దలైనా.. అమలు చేసింది మాత్రం ఈ అధికారులే కదా.. అందుకే మీరు చేసిన తప్పులను రివ్యూ చేసుకోవాలని చెప్తున్నారు చంద్రబాబు. అంతేకాదు వైసీపీ హయాంలో అన్ని తామై వ్యవహరించిన కొందరు అధికారులను ఇప్పటికే చంద్రబాబు దూరం పెట్టేశారు. వారిని కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వలేదు. ఇలాంటి అధికారులంతా ఇప్పటికే సెలవుపై వెళ్లిపోయారు.

Also Read: జగన్ అండ్ కో లిక్కర్ స్కామ్.. శరత్ చంద్రారెడ్డి సంస్థతో లింకులు ?

మరికొందరు మాత్రం ఇప్పటికే చంద్రబాబును కలిశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌ మనుషులుగా ముద్రపడిన అజయ్‌ జైన్.. శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్‌ కుమార్, కేవీవీ సత్యనారాయణ వీరంతా చంద్రబాబును కలిసి విష్‌ చేశారు. అయితే శ్రీలక్ష్మీ, ఆంజనేయులు ఇచ్చిన ఫ్లవర్‌ బొకేను చంద్రబాబు తీసుకోలేదు. మరి వీరిని చంద్రబాబు ఎలా డీల్‌ చేస్తారనేది చూడాలి.

అజయ్‌ జైన్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీకి స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు..ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఎంవో అధికారులతో కలిసి శ్రీలక్ష్మీ పెద్ద ఎత్తున అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో పెద్ద ఎత్తున అవతవకలు జరిగాయని కేవీవీ సత్యనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కో అధికారిపై ఒక్కో ఆరోపణ.. అఫ్‌కోర్స్‌ టీడీపీ నేతలు చేసివవే.. సో వారి కొలువుల్లో నార్మల్‌గా పనిచేసుకోగలుగుతారో.. లేక ఈ ఆరోపణలను బేస్‌ చేసుకొని కేసులు నమోదు చేసుకొని విచారణ చేస్తారో చూడాలి మరి. ఒకవేళ అలా జరిగితే మళ్లీ వీటిని కక్షపూరిత చర్యలు అనకూడదు.. ఎందుకంటే చంద్రబాబు ముందుగానే చెప్పారు. తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదని.. సో.. వీరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి మరి.

అయితే వెరీ సూన్ శాఖల వారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఒక్కొక్కరి పనితనాన్ని ఆయన వ్యాలిడేట్ చేయనున్నారు. అంటే అధికారులకు ముందు ముందు ఇంకా కొన్ని ఉపద్రవాలు ముంచుకు రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది గీత దాటి.. అప్పటి పాలకులతో అంటకాగిన అధికారుల ఒంట్లో భయాన్ని పుట్టిస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×