Samantha – Raj:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha) ఇప్పుడు బాలీవుడ్లో జోరు పెంచింది. అక్కడ వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే తన కెరియర్ సంగతి పక్కన పెడితే.. ఇటు వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటికే వివాహమైన ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru) తో చట్టాపట్టాలేసుకొని తిరగడంతో నెటిజన్స్, సినీ లవర్స్ కూడా ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే (Shyamali Dey) కూడా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్లు పెట్టడంతో నిజంగానే వీరిమధ్య బంధం ఉంది అనే రేంజ్ లో అనుమానాల పుట్టుకొస్తున్నాయి.
కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయిన సమంత – రాజ్ ..
ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న చేతులు పట్టుకొని కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన ఈ జంట.. అంతకుముందు ఫ్లైట్ లో రాజ్ భుజంపై తలపెట్టి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది సమంత. అయితే ఇప్పుడు మరొకసారి అడ్డంగా దొరికేపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇన్నాళ్లు ఫోటోలలోనే కలిసి కనిపించిన వీరు.. ఇప్పుడు ఏకంగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఒకే కారులో కలిసి కనిపించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఒకే కార్ లో పబ్లిక్ అప్పియరెన్స్..
సమంత ఫోన్ మాట్లాడుతుంటే.. రాజ్ తనతో మాట్లాడుతూ.. పక్కనే కూర్చోవడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చాలామంది ఈ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లయిన వాడితో నీ రొమాన్స్ ఏంటి అంటూ సమంత పై ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.. ఏదేమైనా ఇలా సమంత, రాజ్ మరొకసారి కనిపించి, అందులోనూ పబ్లిక్ లో కనిపించడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. మరి దీనిపై ఈ జంట ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
ALSO READ:Rajinikanth Coolie: ప్రమోషన్స్ లో ఇదో కొత్త స్ట్రాటజీ.. ‘కూలీ’ టీం ఏం చేసిందో తెలిస్తే షాక్!
మొదటి పరిచయం అక్కడి నుంచే..
ఇదిలా ఉండగా వీరిద్దరికి మొదటి పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రారంభమైంది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ సౌత్ కే పరిమితమైన ఈమె.. బాలీవుడ్లో ఈ వెబ్ సిరీస్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఈ వెబ్ సిరీస్ తర్వాతనే ఈమెకు నాగచైతన్య విడాకులు ఇచ్చారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ నిడిమోరుతో స్నేహం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది అని, ఇన్నాళ్ల తర్వాత ఆ ప్రేమ బయటపడింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనేది తెలియదు కానీ ఇద్దరు కలిసి కనిపించడంతో ఇలాంటి రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link