E-Paper
Advertisement

Hyderabad Crime: 25 ఏళ్ల పగ.. 200 కోట్ల ఆస్తులు, సినిమా రేంజ్‌లో హత్య.. రియల్టర్ మర్డర్‌లో షాకింగ్ విషయాలు

Hyderabad Crime: 25 ఏళ్ల పగ.. 200 కోట్ల ఆస్తులు, సినిమా రేంజ్‌లో హత్య.. రియల్టర్ మర్డర్‌లో షాకింగ్ విషయాలు
Advertisement

Hyderabad Crime: తెలంగాణ ఉలిక్కిపడుతోంది. కొన్నిరోజులుగా పాత పగలతో కొందరు రగిలిపోతున్నారు. తమ తండ్రుల చావులకు వాళ్లే కారణమని.. ఉక్రోశంతో ఊగిపోయారు. ఎలాగైన సరే వాళ్లను మట్టుబెట్టాలనుకున్నారు. తండ్రి మీద ఉన్న ప్రేమనో.. లేక వాళ్లను చంపాలనే కసితోనే.. ఏదీఏమైనా సరే వదలకూడదనుకున్నారు. ఏమాత్రం తడబడకుండా.. ప్రత్యర్థికి సైతం అనుమానం రాకుండా.. పక్కా స్కెచ్ వేసుకొని మరీ చంపేశారు. ఒకరు తన తండ్రిని గన్ తో కాల్చి చంపేశారని.. తను కూడా తన ప్రత్యర్థిని మొదట కత్తితో పొడిచి.. తర్వాత తుపాకీతో కాల్చి ఆనందపడ్డాడు. ఇంకొకరు ఎటువంటి భయం లేకుండా తన ప్రత్యర్థితోనే స్నేహం చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో మోదీ మరీ ప్రాణం తీశాడు. ఇప్పుడు ఆ రెండు ఘటనలు తండ్రి కోసం కొడుకులు చేసిన హత్యలే.. ఇప్పుడు అవి ఎక్కడ జరిగాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ జవహార్ నగర్ లో రియల్టర్ వెంకటరత్నం హత్య కలకలం రేగింది. చంపేసింది మాత్రం మాజీ రౌడీ షీటర్ సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలనాలు బయటపడ్డాయి. అప్పట్లో సుదేశ్ సింగ్‌కు వెంకరత్నం అనుచరుడిగా, కారు డ్రైవర్ ఉన్నాడు. ఆ సయమంలో కొన్నిరోజులపాటు సుదేశ్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అంతేకాదు వెంకటరత్నంను నమ్మిన సుదేశ్ సింగ్ దాదాపు 200కోట్ల విలువైన ఆస్తులను రాశాడు. నానక్ రామ్ గూడ, కాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్లలో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీస్ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎన్ కౌంటర్ లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆస్తులను తన పేరుపై మార్చాలని రెండు నెలల క్రితం వెంకరత్నంను కలిశాడు సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్. పలుమార్లు కోరాడు. ఇదే సమయంలో చందన్ సింగ్ కు వెంకటరత్నం వార్నింగ్ ఇచ్చాడు. నీ తండ్రి సుదేశ్ సింగ్ ను చంపినట్లే చంపిస్తానంటూ హెచ్చరించా డు. దాంతో తన తండ్రికి వెంకటరత్నమే కారణం.. అంతేకాదు తన తండ్రి సంపాదించిన 200కోట్ల ఆస్తులు కూడా కాజేశాడంటూ చందన్ సింగ్ నిద్రలేని రాత్రులు గడిపాడు. వెంకరత్నంని ఎలాగైనా చంపాలనుకున్నాడు. అనుకున్నదే తడువు ఆయన కదలికలపై ఫోకస్ పెట్టారు. సరైన సమయం రావడంతో ఆటోతో బైక్ ను ఢీ కొట్టి, కత్తులతో దాడి చేసి.. చివరకు తుపాకీతో కాల్చి చంపేశారు.

Advertisement

ఇక ఈనెల 28న సిరిసిల్లలో జరిగిన మాజీ మావోయిస్టు మర్డర్ కలకలం రేపింది. నర్సయ్యను దారుణంగా చంపేశాడు నిందితుడు సంతోష్. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సీన్ కట్ చేస్తే.. 36 ఏళ్ల కిందట పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో అంజయ్య అనే వ్యక్తిని చంపేశాడు నర్సయ్య. తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కొన్నిరోజుల కిందట మాజీ మావోయిస్టు నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వూ ఇచ్చాడు. అందులో అంజయ్యను చంపింది తానేనని చెప్పాడు. కారణం కూడా వివరించాడు. అయితే ఇది తెలుసుకున్న అంజయ్య కొడుకు సంతోష్.. నర్సయ్యను మట్టు బెట్టాలనుకున్నాడు. తన తండ్రి చావుకి కారణం అయిన నర్సయ్య బ్రతికి ఉండొద్దని పథకం రచించాడు. అంతేకాదు ఏకంగా నర్సయ్యతో స్నేహం చేశాడు. కొన్నేళ్లపాటు స్నేహాం కొనసాగించాడు. చివరికి నర్సయ్యను నమ్మబలికి అలా నిర్మానుష్యప్రదేశంలోకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి బండరాయితో మోదీ చంపేశాడు. ఇలా తమ తండ్రులకు చావైన వారిని ఇప్పుడు వాళ్ల కుమారులు చంపేసి తమ పగను చల్చారుకున్నారు. కానీ.. చేసిన తప్పుకు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు.

Advertisement

సిరిసిల్ల ప్రాంతంలో కూడా…?

సిరిసిల్ల ప్రాంతంలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మాజీ మావోయిస్టు నర్సయ్య దారుణ హత్య వెనుక 36 ఏళ్లనాటి పగ ఉందని పోలీసులు వెల్లడించారు. సుమారు 36 క్రితం, నర్సయ్య… పోలీస్ ఇన్ఫార్మర్‌ అనే నెపంతో అంజయ్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత నర్సయ్య జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. అయితే, కొద్ది రోజుల క్రితం అంజయ్యను తానే చంపినట్లు నర్సయ్య వెల్లడించడంతో ఈ విషయం అంజయ్య కుమారుడు సంతోష్ కు తెలిసింది. తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న సంతోష్, తొలుత నర్సయ్యతో స్నేహం పెంచుకున్నాడు. నమ్మించి తీసుకెళ్లి బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. 36 ఏళ్ల పగ తీరిందంటూ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ రెండు హత్యలు కూడా తండ్రుల హత్యలకు ప్రతీకారంగా కొడుకులు చేసినవే కావడం గమనార్హం.

ALSO READ: KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×