Hayath Nagar Fire Mishap: హైదరాబాద్ హయత్‌నగర్ లోని రావి నారాయణరెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిసెల్లో ఉన్న 30 సిలిండర్లు పేలడంతో దాదాపుగా 400 గుడిసెలు దగ్ధమయ్యాయి. గ్యాస్ సీలిండర్లు పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఘటనర స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేసారు. దేవుడి పటాల ముందు వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి సీలిండర్లు పేలాయని, అందుకే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న MRO సుదర్శన్ రెడ్డి ఆస్తి నష్టం పై ప్రభుత్వానికి నివేదిక పంపి బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ ప్రమాదం శనివారం రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి కాలనీ సమీపంలో ఉన్న పేదలు నివసిస్తున్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలకు తోడు.. బలమైన వేడి గాలులు కూడా వీస్తుండటం కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే 30కి పైగా గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కొన్ని గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత తీవ్రంగా ఎగిసిపడ్డాయి. పేలుళ్ల శబ్దాలు విని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయంతో పరుగులు తీశారు.
అయితే గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండటంతో మంటలను పూర్తిగి నియంత్రించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్య్కూట్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏమిటనేది విచారణ అనంతరం తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు స్థానికులను ఆరా తీస్తున్నారు.
ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని తెలుస్తోంది. చాలా మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదం కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి తాత్కాలిక ఆశ్రయం ఆహారం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాటే వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కావున, అందరు అప్రమత్తంగా ఉండాలి.