BigTV English

Hit 3 Pre – Release Event: అర్జున్ సర్కార్ కోసం జక్కన్న.. ఇది కదా అసలైన వేడుకంటే..?

Hit 3 Pre – Release Event: అర్జున్ సర్కార్ కోసం జక్కన్న.. ఇది కదా అసలైన వేడుకంటే..?

Hit 3 Pre – Release Event: నేచురల్ స్టార్ నాని (Nani ) తాజాగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘హిట్ 3 : ది థర్డ్ కేస్’.. ఇప్పటికే ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అటు ‘హిట్ 2’ లో అడివి శేషు (Adivi Shesh) తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరొకసారి తనను తాను నిరూపించుకున్నారు. ఇక క్లైమాక్స్లో నాని నటిస్తున్నాడు అన్న విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటిస్తున్నారు.


హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత క్రూరంగా నాని నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సినిమాతో మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వేదికను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించారు.


చీఫ్ గెస్ట్ గా జక్కన్న..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి, వేదికను అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాదులోని జేఆర్సీ కన్వెషన్ హాల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.అంతేకాదు ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli ) చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలిపారు. మొత్తానికైతే అర్జున్ సర్కార్ కోసం రాజమౌళి రాబోతున్నారని తెలిసి, అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ: Nani: నా యాక్టింగ్ నాకే నచ్చలేదు..ఇలా అన్నావేంటి నాని..

రాజమౌళి సినిమాలు..

ఒక రాజమౌళి విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు (Maheshbabu ) తో SSMB 29 సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తో పాటూ పలువురు భారీతారాగణం ఇందులో భాగమైనట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు రాగా.. ఆయన మెయిన్ విలన్ కాదని, ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కాబట్టి ఇందులో నల్ల జాతీయుడు విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి లో కాలకేయుడు, విక్రమార్కుడు సినిమాలో టిట్లా పాత్రలు ఎలా అయితే పేరు దక్కించుకున్నాయో ఇప్పుడు ఈ సినిమాతో ఆ నల్ల జాతీయుడు పేరు కూడా అంతే మారుమ్రోగుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం తదుపరి షెడ్యూలు మే నెల నుంచి ప్రారంభం కాబోతోంది కాబట్టి ప్రస్తుతం ఖాళీగానే ఉన్న రాజమౌళి ఇలా నాని మూవీ కోసం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×