BigTV English

Pakistan : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని సంచలన ప్రకటన

Pakistan : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని సంచలన ప్రకటన

Pakistan : భారత్ శిక్షిస్తాం అంటోంది. పాకిస్తాన్ ఇది యుద్దమే అని చెబుతోంది. భూమి అంచుల వరకూ వేటాడుతామని మోదీ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులకు అదనపు బలగాలను తరలిస్తూ.. కాల్పులు జరుపుతూ పాపిస్తాన్ కవ్విస్తోంది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు. మరో సర్జికల్ స్ట్రైక్స్ కోసం హిందువులు ఎదురుచూస్తున్నారు. భారతీయుల పీక కోస్తాం అంటూ లండన్‌లో పాక్ ఎంబసీ అధికారి రెచ్చగొడుతున్నాడు. అంతర్జాతీయంగా ఇండియాకు మద్దతు వస్తోంది. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పరిణామాల మధ్య.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. తగ్గేదేలే అంటూ చాలావరకు తగ్గేశారు.


పాకిస్తాన్ సిద్ధమే..

పహల్గాం ఉగ్ర దాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు తాము సిద్దమేనని ప్రకటించారు పాక్ ప్రధాని. అదే సమయంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. కాబూల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఈ వ్యాఖ్యాలు చేశారాయన.


చేతులు కాలాక..

ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుందని.. ఇప్పటికే అపార నష్టాన్ని చవిచూశామని చెప్పారు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్. 90 వేల మందికి పైగా ప్రజలు చనిపోయారని.. 600 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం జరిగిందని గోడు వెళ్లబోసుకున్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని.. శాంతికే తమ ప్రాధాన్యమని చెప్పారు.

తగ్గుతూనే తగ్గేదేలే..

ప్రధాని మోదీ హెచ్చరికలపైనా పరోక్షంగా స్పందించారు పాక్ ప్రైమ్ మినిస్టర్. దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమని.. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామన్నారు. సింధూ జలాలపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని.. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చారు పాకిస్తాన్ ప్రధాని.

పాక్ రక్షణమంత్రి ఎమన్నారంటే..

అంతకుముందు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సైతం దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తానీలకు హాని కలిగిస్తే.. ఇండియన్స్‌కు కూడా హాని చేస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అయితే, చేసిన తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నారాయన. 30 దశాబ్దాల పాటు చాలా చెత్త పనులు చేశామన్నారు. అమెరికా, బ్రిటన్‌ల కోసం.. నిధుల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పేసుకున్నారు. చేసిన తప్పులకు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సింధూ జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలగడం.. యాక్ట్ ఆఫ్ వార్ గా ప్రకటించారు. అయితే, పాక్ డిఫెన్స్ మినిస్టర్ సైతం పహల్గాం ఉగ్ర దాడులపై తటస్థ దర్యాప్తునకు సిద్ధమని చెప్పడం ఆసక్తికరం.

Also Read : పాక్‌పై యుద్ధానికి బలూచిస్తాన్ రెడీ.. ఇండియా కోసం వెయిటింగ్!

Also Read : పీవోకే స్వాధీనం సాధ్యమేనా? సవాళ్లు ఇవే..

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×