BigTV English

Schoolboy Carries Gun| స్కూలుకు తుపాకీ తీసుకెళ్లిన 5 ఏళ్ల బాలుడు.. మూడో తరగతి పిల్లడిపై గురి పెట్టి..

Schoolboy Carries Gun| స్కూలుకు తుపాకీ తీసుకెళ్లిన 5 ఏళ్ల బాలుడు.. మూడో తరగతి పిల్లడిపై గురి పెట్టి..

Schoolboy Carries Gun| అప్పుడే స్కూలు కెళ్లే బుడతుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని వెళ్లాడు. స్కూల్లో అందరూ నిలబడి ఉండగా.. గాల్లో బుల్లెట్లు కాల్చాడు. ఆ తరువాత ఒక 10 ఏళ్ల బాలుడిపై గురిపెట్టి కాల్చాడు. అంతే ఆ బుల్లెట్ ఎదురుగా ఉన్న బాలుడి శరీరంలోకి దూసుకెళ్లింది. బీహార్, సుపౌల్ జిల్లాలో జరిగిన ఈ అనూహ్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూలు యజమాన్యం సమాచారం అందించగా.. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని సుపౌల్ జిల్లా, లాల్ పత్తి త్రివేణి గంజ్ ప్రాంతంలో ఉన్న సెయిట్ జాన్స్ బోర్డింగ్ స్కూల్ లో నర్సరీ లో చదువుతున్న 5 ఏళ్ల పిల్లాడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని స్కూల్ వెళ్లాడు. ఉదయం స్కూల్లో అందరూ ప్రేయర్ చేస్తుండగా.. బ్యాగులో నుంచి గన్ తీసి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దాలు విని అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంతలో ఆ పిల్లాడు.. గన్ తన ఎదురుగా ఉన్న 10 ఏళ్ల బాలుడిపై గురి పెట్టాడు. అది చూసి ఆ బాలుడు భయంతో పరుగెత్తబోతుండగా.. బుల్లెట్ అతని చేతికి తగిలింది. ఇంతలో ఉపాధ్యాయులు ఆ చిన్న పిల్లాడిని వెనుకనుంచి పట్టుకొని గన్ లాగేసుకున్నారు.

Also Read:  ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్


చేతికి బుల్లెట్ గాయమైన బాలుడు మూడో తరగతి చదవుతున్న విద్యార్థి.. అతడిని స్కూల్ ప్రిన్సిపాల్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఆ తరువాత స్కూలుకి గన్ పట్టుకొచ్చిన నర్సరీ పిల్లాడి తండ్రిని ఫోన్ చేసి పిలిపించారు. జరిగిన విషయం తెలుసున్న ఆ పిల్లాడి తండ్రి.. స్కూల్ ప్రిన్సిపాల్ ఆఫీసులో ఉన్న తుపాకీని బలవంతంగా తీసుకొని.. తన పిల్లాడితో అక్కడి నుంచి పారిపోయాడు.

మరోవైపు పోలీసులు సెయింట్ జాన్స్ స్కూల్ చేరుకొని.. విచారణ మొదలుపెట్టారు. ఆ నర్సరీ పిల్లాడి తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఇంట్లో నుంచి ఆ బుడతడు గన్ దొంగిలించి తీసుకొచ్చాడని తెలిసింది. అయితే ఆ పిల్లాడి తండ్రి తప్పించుకొని తిరుగుతున్నాడని.. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసుల తెలిపారు. గాయమైన పదేళ్ల బాలుడి చేతి హస్తం భాగంలో బుల్లెట్ దూసుకుపోవడంతో అతను కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

ఈ ఘటన తరువాత స్థానిక పోలీసులు స్కూళ్లలో పిల్లలు వచ్చే సమయంలో వారి బ్యాగులు చెక్ చేసి లోపలికి అనుమతించాలని సూచించారు.

Also Read: Job Harassment| ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Related News

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Hyderabad News: దారుణం.. భర్తతో గొడవ పెట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?

Gadwal Tragedy: విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు

One Side Love: టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన స్టూడెంట్.. కారణం తెలిసి అంతా షాక్

Delhi News: భార్యను చంపి.. ‘దృశ్యం’ కథ అల్లేసిన భర్త, చివరికి ఇలా దొరికిపోయాడు!

Big Stories

×