BigTV English

Revealing Outfit: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్

Revealing Outfit: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్

Revealing Outfit: అమెరికాలో నర్సు ఉద్యోగం చేసే ఓ మహిళ తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె తనకు జరిగిన అవమానం పట్ల చాలా బాధగా ఉందని తెలిపారు. ఆమె పోస్టు చదివిన నెటిజెన్లు ఆమె పట్ల సానుభూతి తెలుపుతూ.. ఆమెకు జరిగింద అన్యాయమని ట్వీట్లు చేస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలో నర్సుగా పనిచేస్తున్న వై మైన్ మెక్ క్లానహాన్ అనే యువతి తన సెలవు రోజు స్టాబ్స్ ప్రమై స్టీక్ అండ్ సీ ఫుడ్ రెస్టారెంట్ కు డిన్నర్ చేసుందకు వెళ్లింది. అయితే ఆమె ఆ సమయంలో పూల డిజైన్ ఉన్న టూ పీస్ డ్రెస్ ధరించింది. పైన ట్యూబ్ టాప్ వేసుకొని, కింద పొడవాటి స్కర్ట్ వేసుకుంది. అయితే ఆమె రెస్టారెంట్ లో వెళ్లాక ఆమె ఆర్డర్ తీసుకునేందుకు చాలా సేపు ఎవరూ ముందుకు రాలేదు.

క్లానహాన్ కు ఓపిక నశించి.. ”ఎవరైనా ఆర్డర్ తీసుకుంటారా? ప్లీజ్” అని అడిగింది. దీంతో ఆమె వద్దకు వచ్చిన ఒక మహిళా వెయిటర్.. ”మీరు ఈ రెస్టారెంట్ లో నుంచి దయచేసి బయటికి వెళ్లండి.” అని చెప్పింది. ఆమె మాటలు విన్న క్లాన్ హాన్ కు కోపం వచ్చింది. ఎందుకు బయటికి వెళ్లాలని ఎదురు ప్రశ్నించింది. రెస్టారెంట్ నియమాలకు విరుద్ధంగా క్లాన్ హాన్ డ్రెస్సు ఉందని చెప్పి.. వెంటనే వెళ్లిపోండి అని సమాధానం చెప్పింది.


Also Read: Job Harassment| ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

ఇది విన్న క్లాన్ హాన్ కు తనను ఆమె అవమానిస్తోందని భావించి.. రెస్టారెంట్ ఓనర్ తో మాట్లాడిన తరువాతే బయటికి వెళతానని అక్కడే కూర్చొంది. ఆ తరువాత క్లానహాన్ వద్దకు రెస్టారెంట్ ఓనర్ డోరీ ముర్విన్ అనే వ్యక్తి వచ్చి.. ”చూడండి మిస్.. మీరు వేసుకున్న బట్టలు సరిగా లేవు.. మా రెస్టారెంట్ లో ఇలాంటి బట్టలు వేసుకొని రావడానికి అనుమతి లేదు” అని చెప్పగానే.. క్లానహాన్ కు కోపం వచ్చింది.

తాను మరీ అంత పొట్ట బట్టలు ధరించలేదని.. అయినా రెస్టారెంట్ లో పనిచేసే మహిళా వెయిటర్లు మరీ చిన్న స్కర్ట్ లు ధరించి ఉండగా.. తన డ్రెస్సు కే మైందని ప్రశ్నించింది. దానికి బదులిస్తూ.. ముర్విన్, ”మీతో వాదనలు అనవసరం.. మీరు పైన వేసుకున్న డ్రెస్సు మరీ చిన్నదిగా ఉంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇక్కడికి రాకూడదు,” అని కోపంగా చెప్పాడు.

అయినా క్లానహాన్ వెళ్లనని అక్కడే కూర్చోవడంతో రెస్టారెంట్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చి.. ఆమెను బలవంతంగా బయటికి గెంటేశారు. ఈ ఘటనను వివరంగా క్లానహాన్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. పైగా ఈ ఘటన తరువాత తాను అదే డ్రెస్ లో మరో రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసినట్లు తెలిపింది. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఆ డ్రెస్సులోనే బయటికి వెళ్లానని.. ఎక్కడా ఎవరూ అభ్యంతరం చేయలేదని చెప్పింది.

ఈ ఘటనపై రెస్టారెంట్ ఓనర్ ని న్యూయార్క్ టైమ్స్ సంస్థ సంప్రదించగా.. రెస్టారెంట్ ఓనర్ ముర్విన్ మాట్లాడుతూ.. ‘మా రెస్టారెంట్ లో ఎలాంటి డ్రెస్ వేసుకోకూడదో వివరంగా మా అఫిషియల్ వెబ్ సైట్ లో ముందే చెప్పాం. అయినా ఆమె వేసుకున్న దుస్తుల్లో ఛాతీ భాగం నగ్నంగా కనిపిస్తోంది. ఇలాంటి డ్రెస్ లు వేసుకొని వస్తే అనుమతించేది లేదు. జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు.’ అని వివరణ ఇచ్చారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×