BigTV English

Madrasa Boy Murder: ‘ఎవరైనా చనిపోతే స్కూలుకు సెలవు ఇస్తారని’.. అయిదేళ్ల పసివాడిని హత్య చేసిన విద్యార్థులు

Madrasa Boy Murder: ‘ఎవరైనా చనిపోతే స్కూలుకు సెలవు ఇస్తారని’.. అయిదేళ్ల పసివాడిని హత్య చేసిన విద్యార్థులు

Madrasa Boy Murder| దేశ రాజధాని ఢిల్లీలో ఒక అనూహ్య ఘటన జరిగింది. ఒక అయిదేళ్ల పసివాడిని తోటి విద్యార్థులంతా కలిసి కొట్టి కొట్టి చంపేశారు. పోలీసుల విచారణ చేయగా.. మూక దాడి చేసిన వారిలో ఒకడు తమ స్కూలు కు సెలవు ఇస్తారని చంపేశామని చెప్పాడు. ఇది విని పోలీసులకు సైతం ఆశ్చర్యం కలిగింది. అయితే దాడి చేసిన మిగతా వారు వేర్వేరు కారణాలు చెప్పారు.


వివరాల్లోకి వెళితే.. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోని దయాల్ పూర్ ప్రాంతంలో ఉన్న ఉన్న ముస్లిం మదరసా స్కూల్ లో రాషిద్ అనే అయిదేళ్ల బాలుడు చదువుకుంటున్నాడు. అయితే శుక్రవారం ఆగస్టు 24న రాషిద్ తల్లికి మదరసా యజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది. రాషిద్ ఆరోగ్యం బాగోలేదని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. రాషిద్ తల్లి అమీనా బేగం, ఇళ్లలో పనిమనిషిగా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త ఉత్తర్ ప్రదేశ్ లో చిన్న ఉద్యోగం చేస్తూ.. అక్కడే ఉంటాడు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తాడు. అమీనా బేగంకు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిద్దరు అమీనా బీ వద్దే ఇంట్లోనే ఉంటారు.

ఈ క్రమంలో అమీనా బీకి మదరసా నుంచి రాషిద్ కు ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రాగానే ఆమె వెంటనే మదరసాకు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లి చూడగా.. రాషిద్ కళ్లు తెరవడం లేదు. నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే అమీనా బీ.. తన బిడ్డను తీసుకొని సమీపంలోని బృజ్ పూరి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు రాషిద్ ని పరీక్షించి పిల్లాడు చనిపోయాడని తెలిపారు. అయితే పిల్లాడి ఒంటిపై బలమైన గాయాలున్నాయి. ఎవరో పిల్లాడిని బలంగా కడుపు, ఛాతి భాగంలో కొట్టడంతో శరీర లోపలి భాగాల్లో రక్త స్రావమై రాషిద్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇది విన్న అమీనా బీ తన బిడ్డను తీసుకొని తిరిగి మదరసా వద్దకు వెళ్లింది. తన బిడ్డను చంపిన వాళ్లని తనకు అప్పగించాలని గొడవ చేసింది. అమీనా బీ తో పాటు ఆమె బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో మదరసా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అదుపు చేయడానికి మదరసా నిర్వహకులు పోలీసులకు ఫోన్ చేశారు.


పోలీస్ స్టేషన్ కు రాత్రి 9.50 గంటలకు ఫోన్ వచ్చింది. మదరసా స్కూల్ లో చదువుకుంటున్న ఒక పిల్లాడు చనిపోయాడని.. చాలామంది జనం అక్కడ గుమిగూడి హింసాత్మకంగా మారారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జనాన్ని తరలించి పిల్లాడి శవాన్ని తీసుకొని జీటీబీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు పిల్లాడు ఎలా చనిపోయడనేది పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు తిరిగి మదరసా చేరుకొని విచారణ మొదలుపెట్టారు.

మదరసా నిర్వహకులు 5 ఏళ్ల రాషిద్ ని ముగ్గురు పిల్లలు కలిసి కొట్టారని.. ఈ కారణంగానే రాషిద్ చనిపోయాడని తెలిపారు. పోలీసులు ఆ ముగ్గురు పిల్లలను పిలిచారు. వారంతా 9 నుంచి 11 ఏళ్ల వయసు గల విద్యార్థులు. ఈ ముగ్గరూ కలిసి రాషిద్ ని బాగా చితకబాదారు. రాషిద్ ని కింద పడేసి కాళ్లతో గట్టి గట్టిగా తన్నారు. దీంత రాషిద్ చనిపోయాడు.

పోలీసులు ఆ ముగ్గురు మైనర్ నిందితులను విచారణ చేయగా.. ఒకడేమో రాషిద్ వారిని బాగా ఇబ్బంది పెట్టేవాడని అందుకే కసిగా కొట్టానని చెప్పాడు. మరొకరేమో మైనర్ నిందితుడేమో రాషిద్ అంటే తనకు ఇష్టంలేదని అందుకే కొట్టానని చెప్పాడు. చివరగా ఒక పిల్లాడు.. మదరసాకు సెలవు వస్తుంది కదా అని కొట్టాను అని అన్నాడు. ఇది విని పోలీసులకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఆ మూడో పిల్లాడిని మళ్లీ పిలిచి స్పష్టంగా చెప్పమని అడిగారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

అప్పుడా పిల్లవాడు సమాధానమిస్తూ.. ”ఎవరైనా చనిపోతే మదరసాకు సెలవు ఇస్తారని తెలుసు.. అందుకే రాషిద్ చచ్చిపోతే తమకంతా మదరసా నుంచి సెలవు దొరుకుతుందని అతడిని బాగా కొట్టామని” చెప్పాడు. ఇది విని పోలీసులకు నమ్మశక్యం కాలేదు.

అయితే పోలీసులు రాషిద్ హత్య కేసులో మదరసా నిర్వహకులను అరెస్టు చేశారు. రాషిద్ చావుకి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అనుమానిస్తున్నారు. రాషిద్ హత్య కేసుని నమోదు చేసి నిందితులైన మగ్గురు పిల్లలను బాలుర కారాగారానికి తరలించారు.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×