BigTV English

Tapsi pannu coments: తానేమీ పబ్లిక్ ప్రాపర్టీని కానంటోంది సొట్ట బుగ్గల తాప్సీ

Tapsi pannu coments: తానేమీ పబ్లిక్ ప్రాపర్టీని కానంటోంది సొట్ట బుగ్గల తాప్సీ

Tapsi pannu coments on photographers viral..Iam not public property : 2010లో ఝుమ్మంది నాదం మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. న్యూఢిల్లీలోని జాట్ సిక్కు కుటుంబంలో జన్మించింది తాప్సీ. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది. అయితే వివాదాస్పద అంశాలలో తాప్సీ ముందుంటుంది.ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్ సినిమా దర్శకులు ఎక్కువగా హీరోయిన్లను ఎక్స్ పోజ్ చేస్తుంటారని బొడ్డు, నడుము మాత్రమే చూపిస్తారంటూ అప్పట్లో తాప్సీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అయితే ఇటీవల తాప్సీ నటించిన మూవీకి సంబంధించి స్పెషల్ షోను ఓ థియేటర్ లో వేశారు. అయితే మీడియాకు సంబంధించిన ఫొటోగ్రాఫర్లు ఒక్కసారిగా తాప్సీని చుట్టుముట్టారు.


తాప్సీ వార్నింగ్

ఓ ఫొటోగ్రాఫర్ అయితే ఏకంగా తాప్సీ మొహం మీదే కెమెరా పెట్టేశాడు. దానితో తాప్సీ అసహనానికి గురయింది. వెంటనే సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చేసింది. మీద పడకండి అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. గతంలోనూ చాలా సందర్భాలలో ఫొటోగ్రాఫర్ల మీద చిరాకు పడింది తాప్పీ. ఇటీవల ఇదే విషయంపై స్పందించింది. నేను కూడా అందరి ఆడపిల్ల లాంటిదాన్నే..నేను నటిని..ఫొటోగ్రాఫర్లంతా మీద పడిపోవడానికి నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు. నటిని కాకపోయివుంటే ఓ అమ్మాయిని. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అందుకే ఈ ఫీల్డ్ కి వచ్చాను. నేను నా వృత్తిని గౌరవిస్తాను..ప్రేమిస్తాను. మీద పడిపోయి ఫొటోలను తీయడం నాకు నచ్చదు.


తాప్సీ పద్దతి మార్చుకో

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.మీరు నాకు మర్యాద ఇస్తే నేను కూడా మీకు మర్యాద ఇస్తా..నన్ను ఫిజికల్ గా హ్యాండిల్ చేయడం ఏమిటి? నాపై అరవడమేమిటి? నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీని కాను అంటోంది తాప్సీ. ఈ మధ్య తాప్సీ ఫొటోగ్రాఫర్లపై దురుసుగా మాట్లాడటం వైరల్ గా మారింది వీడియో. తాప్సీ ఫొటోగ్రాఫర్ల విషయంలో అలా చేయడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లకు ఫ్రీగా పబ్లిసిటీ కావాలి కానీ..కెమెరామెన్లు పనికిరారా? తాప్సీ పద్దతి మార్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×