Hyderabad: హైదరాబాద్‌లోని సన్‌సిటీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారి, చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కళ్ల ముందే పసిపాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.
బాధితుల కథనం ప్రకారం.. చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సన్ సిటీలోని క్రేయాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది చిన్నారిని పరీక్షించి ఒక మందును అందించారు. అయితే, ఆ మందు వేసిన కొద్దిసేపటికే చిన్నారి ఆరోగ్యం వేగంగా క్షీణించి, ఊపిరి అందక మృతి చెందింది. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారికి ఇచ్చిన మందులను గమనించిన తల్లిదండ్రులు, అవి గడువు ముగిసిన (Expired) మందులని ఆరోపిస్తున్నారు. డేట్ అయిపోయిన మందులు ఇవ్వడం వల్లే రియాక్షన్ వచ్చి చిన్నారి ప్రాణాలు పోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితులు, వారి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
Also Read: లవ్ మ్యారేజ్‌లో ఇన్‌స్టా చిచ్చు.. ఏం జరిగిందో తెలుసా? రంగారెడ్డి జిల్లాలో దారుణం
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని, బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైద్యం వికటించి 6 నెలల పసికందు మృతి
హైదరాబాద్ సన్ సిటీలో విషాద ఘటన
చిన్నారికి జ్వరం రావడంతో క్రేయాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
మందు ఇచ్చిన కాసేపటికే చిన్నారి మృతి
గడువు ముగిసిన మందులు ఇవ్వడం వల్లే చిన్నారి మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ
ఆస్పత్రి… pic.twitter.com/tAFiIoYwwC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2026