Mancherial Incident: మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలం అయిందని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో రైలు కింద పడి హిత వర్షిణి ఆత్మ హత్య చేసుకోగా.. విషయం తెలిసి ప్రియుడు వినయ్ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇద్దరు ప్రేమికుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో ఈ హిత వర్షిణి(20), వినయ్(22) అనే యువతి, యువకుడు ప్రేమ విఫలం అయ్యిందని మరణించారు. అయితే వారిద్దరూ చిన్న నాటి స్నేహితులు. అలా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకే సామాజిక వర్గం కావడంతో సంతోషించారు. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో జీవితాన్ని సాగించాలని కలలు కన్నారు. ఇరువురి ఇంట్లో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వారి ఇద్దరీ ప్రేమ విఫలమైంది. దీంతో ముందుగా హితవర్షిణి ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మరణవార్త తెలుసుకున్న వినయ్ తాను లేకుండా నేను ఉండలేను అని తాను కూడా తన ఇంటి ముందు ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు ఢీ కొడితే చనిపోతామా అంటూ.. తండ్రితో చర్చించిన కూతురు
అయితే వీరిద్దరు విజ్ఞాన్ కాలేజ్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కొన్ని రోజులుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విఫలం కావడంతో ఇలాంటి ఘటనకు ఒడిగట్టారని అంటున్నారు. అయితే ఈ ఘటనకు రెండు రోజుల ముందు ట్రైన్ ఢీ కొడితే చనిపోతామా అని హితవర్షిణి తండ్రితో చర్చించింది. దీనిబట్టి వీరు ముందు నుంచే చనిపోవడానికి ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే వినయ్ బలవన్మరణానికి ముందు ఒక కన్నీటి లేఖ రాసాడు.. ఆ లేఖ ప్రస్తుతం ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది.
వినయ్ కన్నీటి లేఖ..
అయితే వినయ్ రాసిన లేఖలో “ఈ జన్మకి తానే తోడుగా ఉంటుంది అనుకున్నాను.. తాను ఆత్మహత్య చేసుకున్న సమయంలో తీవ్ర మనోవేదనకు గురైంటుంది.. హితవర్షిణి చనిపోయిన క్షణం నుండి నా ప్రాణం పోయినట్టుగా ఉంది.. ఏం చేయ్యాలో అర్థం కావడం లేదని తెలిపారు. అయితే బ్రతికుంటే ఇద్దరం కలిసే బ్రతకాలి.. చస్తే ఇద్దరం కలిసే చావాలి అనుకున్నం.. ఇప్పుడు నువ్వు చనిపోతే నేను ఎందుకు బ్రతికుంటా.. ఇప్పుడు కాకపోయిన వచ్చే జన్మలో అయిన ఇద్దరం కలిసే బ్రతుకుదాం.. అంతేకాకుండా నువ్వు ఒక్కదానివే వెళ్లీపోయావు.. అక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావ్.. నేను చనిపోయి వచ్చి నీకు సర్‌ఫ్రైజ్ ఇస్తా.. ఎలాగో కలిసి బ్రతకలేదు.. చావులోనైన మనిద్దరం ఒకటిగా ఉందా” అని లేఖలో రాసి మరిణించాడు.
నిజమైన ప్రేమకి వీరి ప్రేమే నిదర్శనం..
నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో వీరిద్దరిని చూస్తే అర్థం అవుతుంది. వినయ్ తల్లదండ్రులకు, వారి కుటుంబసభ్యులకు వివరిస్తూ తాను లేనిది నేను బ్రతకలేను.. ఇక నాకు ఇక సెలవు.. నా జీవితం ఇంతటితో ముగిసింది అంటూ లేఖలో రాసాడు.. కానీ హితవర్షిణి ఆత్మహత్యకు అసలు కారణాలేంటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..? వారి ఇద్దరి ప్రేమ ఇంట్లో తెలిసి ఏదైనా గోడవ జరిగిందా..? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. సీపీ రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి
పోలీసుల విచారణ..
అయితే పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్‌లు, చాట్‌లు పరిశీలిస్తున్నారు. వారి మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయా? లేదా కుటుంబ ఒత్తిడి ఉందా? అనే అంశాలపై దృష్టి సారించారు. ఈ ఘటన యువతకు ఒక హెచ్చరికగా మారాలి. ప్రేమ విఫలమైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడటం సరైనది కాదు.. అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు హితవర్షిణి
ప్రియురాలి మరణ వార్త విని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు వినయ్
ఘట్కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న హితవర్షిణి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ… pic.twitter.com/3P9jaqKMaw
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025