Intinti Ramayanam Today Episode September 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ భరత్ ని పిలిచి వీధి చివర టైలర్ షాప్ ఉంది నా బ్లౌజులు కాస్త లూజ్ చేయించుకుని రావాలి అడుగుతుంది. అది మొదటి విన్న భరత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రణతి వచ్చి మా ఆయనే నీకు పనిమనిషి అనుకుంటున్నావా? ఎలాంటి విషయాలు చెప్తున్నావు వదిన అనేసి అడుగుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా అందుకే చెప్పాను అని శ్రియ అంటుంది.
మగాళ్ళకి చెప్పాల్సిన పనిలేనా అవి ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా బుద్ధుందా? నేను అలాంటి పనులు మీ ఆయనకి చెప్తే ఊరుకుంటావా అని ప్రణతి అడుగుతుంది. అక్క చెప్తే ఆ పనులు చేయడా అని శ్రీయ అంటుంది. మా అక్క ఇలాంటి పనులు నాకు ఎప్పుడూ చెప్పదు అని భరత్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి మనం అవునన్నా కాదన్నా భరత్ ఇప్పుడు ఏంటి అల్లుడు మనం బాగా చూసుకోవాలి. ఇలా చిన్న విషయాలకి అవమానిస్తావని అంటుంది. భరత్ నీ అక్కడి నుంచి ప్రణతి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ భరత్ కచ్చితంగా మన వైపు తిప్పుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి భరత్ ను ఎలాగైన తనవైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. కావాలనే భరత్ తో మాట్లాడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా మా ఇంటి అల్లుడువి ఖచ్చితంగా నీకు మేము సేవలు చెయ్యాలి. శ్రీయ అన్న మాటలకు అస్సలు ఫీల్ అవ్వకు అని అంటుంది. నాకు బ్రదర్ లేడు. నువ్వు నా కు తమ్ముడు లాంటిదే నువ్వు ఏమీ బాధపడకు. నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని పల్లవి అంటుంది. పల్లవి మాటకి భరత్ మెల్ట్ అయిపోతాడు.. పల్లవి భరతు నా మాట వింటున్నాడు ఇక నా దారిలోకి వచ్చినట్లే అని అంటుంది. అవని నీ దెబ్బ కొట్టాలంటే భరత్ నువ్వు ఆయుధంగా వాడుకోవలేని అనుకుంటుంది.
పార్వతిని ఇంటికి తీసుకొచ్చిన అవని శ్రేయని శ్రీకర్ని పిలుస్తుంది.. అత్తయ్య గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా కొంచమైనా నీకు బుద్ధుందా? చదువుకున్న దానివేగా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాట అడగడానికి నువ్వు ఎవరు అని శ్రేయ అంటుంది. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే నువ్వు ఏది చెప్తే అది చేయాలి. కానీ శ్రీయా మారడానికి కారణం నువ్వే అని పల్లవి పై సీరియస్ అవుతుంది అవని.. భరత్ పల్లవి అక్కని ఏమీ అనొద్దు అని అడ్డుపడతాడు. ఈ పల్లవి నిన్ను కూడా పూర్తిగా మార్చేసిందని అడుగుతుంది..
Also Read : శ్రీవల్లికి దొరికిపోయిన నర్మద, సాగర్.. కళ్యాణ్ దెబ్బకి షాక్.. ధీరజ్ కు ప్రేమ నిజం చెప్తుందా..?
ఎవరు ఎలా మారినా నాకు సంబంధం లేదు.. అత్తయ్య గారిని పెద్ద చిన్న లేకుండా మాటలు అంటే నేను అసలు ఊరుకోను. నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని పల్లవి అంటుంది. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అవని. అయితే శ్రీకర్తో మాట్లాడాలని బయటికి పిలుస్తుంది.. అక్కడికి వచ్చిన శ్రీకర్ నా భార్య అలా మాట్లాడడం తప్పేమీ కాదు కదా అని అవినీకి షాక్ ఇస్తాడు. అయితే అవని ఇంటికి వచ్చి ఆరాధ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ ఆరాధ్యకు చాక్లెట్లు స్వీట్లు అన్ని చాలా తెచ్చిస్తాడు. నీకు జీతం వచ్చిందని నాకు ఇచ్చావు మరి మమ్మీకి ఏం తెచ్చావని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. పార్వతి ఆరోగ్య సరిగ్గా లేదని ఎవరిని బ్రతిమలాడిన కూడా ఎవరూ పట్టించుకోరు. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. పల్లవి శ్రీ అని కూడా కనీసం పట్టించుకుంటే ఈ ఒక సేవలు చేయాల్సి వస్తుందని మాట్లాడుకున్న తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇక పార్వతి అవని దగ్గరికి వెళ్ళిపోతుంది. రాజేంద్రప్రసాద్ ఆ విషయం చెప్పగానే పార్వతి అవని సంతోషపడతారు. మొత్తానికి పార్వతీ తన భర్త దగ్గరికి చేరుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..