Kurnool News: పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా భర్తలను ఈ లోకం నుంచి పంపేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి ఏపీలో వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ, భర్తను వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం భర్తను లేపేసింది. ఫలితంగా ప్రియుడితో కలిసి దొరికిపోయింది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో దారుణమై ఘటన వెలుగుచూసింది. తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిళం-కల్లపరికి చెందిన గంగావతికి ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పనుల నిమిత్తం కర్ణాటకలోని యాదగిరి జిల్లాకి వెళ్లేశారు. అక్కడ రత్నగిరి ప్రాంతంలో పత్తి పంటలో పనులకు వెళ్లేవారు.
అదే సమయంలో కర్ణాటకకు చెందిన చెన్నబసవ తన ట్రాలీ ఆటో ఎక్కించుకొని కూలీలను తీసుకెళ్లేశాడు. ఆ విధంగా గంగావతి-చెన్నబసవ మధ్య పరిచయం పెరిగింది. ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ క్రమంలో వీరిద్దరు భర్త కంట పడ్డారు. తొలుత భార్యని హెచ్చరించాడు భర్త అహోబిళం. ఆ తర్వాత గంగావతి-చెన్నబసవ మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కొన్నినెలలు పని చేసిన అహోబిలం దంపతులు స్వగ్రామానికి చేరుకున్నారు. ప్రియుడి మోజులో పడింది గంగావతి. ప్రియుడి లేకుండా ఒక్కక్షణం ఉండేది కాదు. భర్త హెచ్చరికలు నేపథ్యంలో అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది.
ALSO READ: అమెరికాలో దారుణం.. మూత్ర విసర్జన ఆపమన్నందుకు కాల్చి చంపేశాడు
సెప్టెంబర్ 2న ప్రియుడికి ఫోన్ చేసింది గంగావతి. ఈనెల మూడున భర్త.. తన సొంతూరు వెళ్తున్నాడని, సాయంత్రం తాము వచ్చే దారిలో కాపు కాసి చంపేయాలని ప్రియుడికి చెప్పింది. అనుకున్నట్టుగానే అహోబిలం పుట్టింటి గ్రామంలో మాల పౌర్ణమి పండగ చేసుకున్నాడు. పండగ తర్వాత సాయంత్రం టూ వీలర్స్‌పై అహోబిళం ఒంటరిగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
ప్లాన్ ప్రకారం దొడగొండ- కల్లపరి గ్రామాల మధ్య కాపు కాశాడు చెన్నబసవ. వాహనాన్ని ఆపి అహోబిళాన్ని.. చెన్నబసవ తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా గొంతుకోసి హత్య చేశాడు. సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద అహోబిలం మృతదేహం లభ్యమైంది. చివరకు ఈ విషయం మృతుడి తండ్రికి తెలిసింది.
వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగేశారు. మృతుడి భార్య గంగావతిని విచారించారు. దీంతో అన్నివిషయాలు వెలుగులోకి వచ్చాయి. గంగావతి, ఆమె ప్రియుడు చెన్నబసవతో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా అరెస్టు చేశారు పోశారు పోలీసులు. సి, రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పై విషయాలను పోలీసులు వెల్లడించారు.