E-Paper
Advertisement

Jangaon Municipality: బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం.. ఆర్టిఐ సమాచారంతో వెలుగులోకి సంచలన నిజాలు!

Jangaon Municipality: బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం.. ఆర్టిఐ సమాచారంతో  వెలుగులోకి సంచలన నిజాలు!
Advertisement

Jangaon Municipality: జనగామ స్వేచ్ఛ: గత బీఆర్ఎస్ (Brs) పదేళ్ల కాలంలో జనగామ మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని యాసారపు కరుణాకర్ వెల్లడించారు. ఈ అక్రమాలకు సంబంధించిన దందాపై ఆర్టిఐ లో సమాచారం సేకరించి వెల్లడిస్తున్నట్లుగా తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో (Jangaon Municipality) చైర్మన్ లు మున్సిపాలిటీ నిధులను ఎంపీ రికార్డులు, ప్రొసీడింగ్, బిల్లులు లేకుండా డీజిల్, బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ, విద్యుత్ పరికరాలు కొనుగోళ్లలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని పత్రిక ప్రకటన ద్వారా వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాసారపు కరుణాకర్ తెలిపారు.

Also Read:Telangana Municipal Elections: జనసేన మద్దతుపై బీజేపీ పునరాలోచన? ఈనెల ఆ తేదీల్లో పవన్ ప్రచారం! 

చెత్త తరలించే ట్రాక్టర్లలో పోసే డీజిల్ లో అక్రమాలు

Advertisement

ఇళ్లలోని చెత్త తరలించే ట్రాక్టర్లలో పోసే డీజిల్ లో బిల్లులు లేకుండా పోకల జమున సమయంలో రూ.4 కోట్ల 38 లక్షలు స్వాహ చేసినట్లుగా తెలిసిందన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించిన బిల్లులకు లెక్కలు లేకుండా రూ.2 కోట్ల 70 లక్షలు ప్రేమ లతా రెడ్డి హయాంలో, రూ.5.80 కోట్లు పోకల జమున హయాంలో దుర్వినియోగం చేశారని వివరించారు. న్యూస్ పేపర్లలో వేసే అడ్వర్టైజ్మెంట్ విషయంలోనూ పోకల జమున హయాంలో రూ.10 లక్షలు లెక్కలు లేకుండా ఖర్చు చేశారన్నారు. కరెంటు పరికరాలు కొనుగోలు విషయంలో ప్రేమలతా రెడ్డి హయాంలో రూ. 62 లక్షలు, పోకల జమున హయాంలో రూ.1.50 కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడించారు.

బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ కొనుగోళ్లలో అవకతవకలు

వర్షాకాలం నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వాడే బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ కొనుగోళ్లలో ప్రేమలతా రెడ్డి హయాంలో రూ.34 లక్షలు, పోకల జమున హయాంలో రూ. 15 లక్షలు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే కాకుండా ఉద్యోగులకు జీతాల నుండి వసూలు చేసి వారి ఖాతాలలో జమ చేయలేదని తెలిపారు. జనగామ ప్రజలు ఈ ఎన్నికల్లో 10 సంవత్సరాలు జనగామ పట్టణంలో అభివృద్ధి చేయకుండా పారిశుద్ధ్యం, వీధి దీపాల పనులను పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ కు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: Jagan Tour: జగన్‌ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు, టూర్ల వెనుక అసలు కథ ఇదేనా?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×