Gas Cylinder Blast: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ పేలుడు సంభవించింది. పురా కలందర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు జరిగి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనపై యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ఆరా..
గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఘటనా స్థలంలో గన్ పౌడర్ గానీ.. బాణాసంచా తయారు చేసిన ఆనవాళ్లేమీ గుర్తించలేదని తెలిపారు. ఘటనపై ఆరా తీశారు యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో మరో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో LIG గ్యాస్ సిలిండర్ పేలి మరో వ్యక్తి మృతి.. అయితే ఆనంద్ స్వరూప్ (22) సిలిండర్‌ను మార్చడానికి వచ్చాడు.. దానిని మార్చే క్రమంలో ఒక్కసారిగా పేలింది.. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆనంద్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ స్వరూప్ మృతి చెందాడు.
Also Read: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది
స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేస్తున్నారు. అలాగే ఘటన స్థలానికి మియాపూర్ ఏసీపీ శ్రీనివాస రావు, రామచంద్రాపురం పోలీసులు చేరుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కరు మృతి..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని LIG కాలనీ ఘటన
సిలిండర్ పేలిన ఘటనలో ఆనంద్ స్వరూప్ (22) అనే యువకుడు మృతి
సిలిండర్ ను మార్చే క్రమంలో ఒక్కసారిగా పేలుడు
తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ స్వరూప్ మృతి… pic.twitter.com/MTtU0wKm3v
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2025