E-Paper

ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్

ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్

Karnataka: కర్ణాటకలోని మండ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆ ఫ్యామిలీకి వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీని నుంచి గట్టెక్కలేక ఆ వ్యాపారి భార్య, కొడుకును చంపేశాడు. ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే డెత్ నోట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటకలో దారుణం.. ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

కర్ణాటకలోని మండ్య జిల్లాలో బట్టల షాపు వ్యాపారి ప్రభాకర్ ఉంటున్నాడు. ఆయన వయస్సు 65 ఏళ్లు. భార్య వయస్సు 55 ఏళ్లు, కుమారుడు 28 ఏళ్లు. తన వ్యాపారం మొదట్లో బాగానే జరిగేది. ఆ తర్వాత రోజు రోజుకూ నష్టాలు రావడం మొదలయ్యాయి. పోలీసుల చెప్పిన వివరాల మేరకు.. ప్రభాకర్ తన ఇంట్లో భార్య-కొడుకులను చంపేశాడు. ఆ తర్వాత తన షాపుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రభాకర్ ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షాపులో ప్రభాకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతుడి ఇంటికి వెళ్లారు. ప్రభాకర్ మొదట తన భార్య జ్యోతిని ఊపి రాడకుండా చంపేశాడు. ఆ తర్వాత కుమారుడు సంతోష్‌పై దాడి చేసి హత మార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.

డెత్ నోట్‌లో కీలక విషయాలు..  ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్ కారణమంటూ

ఆ హత్యలు, ఆత్మహత్య వెనుక కారణాలు తెలుసుకునే ఇళ్లంతా వెతికితే డెత్ నోట్ కనిపించింది. అందులో వ్యాపారి ప్రభాకర్ కీలక విషయాలు వెల్లడించారు. తాను గృహ రుణం తీసుకున్నానని, ఈఎంఐ చెల్లించలేక ఒత్తిడికి గురవుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. వ్యాపారంలో నష్టాలు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని, భార్య జ్యోతిని తాను చంపినట్లు అందులో ప్రస్తావించాడు.

ఈ విషయాన్ని మండ్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శోభా రాణి వీజే తెలిపారు. తన వ్యాపార నష్టానికి కర్ణాటక ప్రభుత్వ తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం కారణమని ప్రస్తావించినట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల స్థానిక కస్టమర్లు కొనుగోళ్ల కోసం మైసూరు, బెంగళూరు నగరాలకు వెళ్లున్నారని ప్రస్తావించాడట. దీంతో తన వ్యాపారం దెబ్బతిందని ప్రభాకర్ ఆ లేఖలో వ్యక్తం చేసినట్లు ఎస్పీ ధ్రువీకరించారు.

ALSO READ: ఏసీబీ దాడుల్లో సంచలనం.. మోహన్ నాయక్ అక్రమాస్తులు చూసి అధికారులే షాక్!

ప్రభాకర్ ఫైనాన్స్ కంపెనీల నుంచి దాదాపు రూ. 7 లక్షల అప్పు తీసుకున్నట్లు తేలింది. దర్యాప్తులో తేలింది. నెల రోజుల కిందట కొడుకు సంతోష్‌కు వివాహం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మండ్య పోలీసులు. ప్రభాకర్-జ్యోతి ఒక గదిలో పడుకున్నారు. సంతోష్, అతడి మేఘన మరో గదిలో పడుకున్నారు. తన భర్త ఎప్పుడు లేచి గది నుండి బయటకు వెళ్ళాడో తనకు తెలియదని మేఘన చెప్పింది.

మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో నిద్ర లేచి ఇంటి పనులు పూర్తి చేసునట్టు తెలిపింది. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో అత్తని నిద్రలేపడానికి వెళ్ళానని మేఘన పోలీసులకు తెలిపింది. లోపల గడియ పెట్టి ఉండటాన్ని గమనించానని, బలవంతంగా తలుపు తెరిచి చూడగా వారంతా విగతజీవులుగా కనిపించారని కన్నీరుమున్నీరు అయ్యింది.

 

Related News

BMW కారు, 33 తులాల బంగారం, 25 మంది భార్యలు.. ఒకే ఒక్క ఫిర్యాదుతో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!

కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు దుర్మరణం!

నేపాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, ఎనిమిది మంది మృతి!

ఖాకీకే గురి.. పట్టపగలే రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చైన్ స్నాచింగ్!

మియాపూర్‌లో విషాదం.. చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళ

×