E-Paper
Advertisement

లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !
Advertisement

Trolls On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి టీమ్ ఇండియాలోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. టీమిండియాలోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. టన్నులకొద్దీ పరుగులు చేసి, భారత జట్టుకు అనేక ట్రోఫీలు అందించాడు. అలాగే టీమిండియా కెప్టెన్ గా కూడా ఎన్నో విజయాలను అందించాడు. అలాంటి విరాట్ కోహ్లీ పరువు తీసేలా వ్యవహరించారు కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు. విరాట్ కోహ్లీ హైట్ గురించి హేళన చేస్తూ మాట్లాడారు. విరాట్ కోహ్లీ పొట్టోడు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

విరాట్ కోహ్లీ పొట్టోడు అంటూ దారుణంగా కామెంట్స్!

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి చాలా దారుణంగా మాట్లాడారు ఇంగ్లాండ్ అభిమానులు. అతడు హైట్ తక్కువగా ఉన్నాడని కామెంట్ చేస్తూ పోయారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్, టి20 తో పాటు వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా చివరి వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూమ్ కు విరాట్ కోహ్లీ బయలుదేరాడు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి స్టేడియం దగ్గర ఉన్న కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు పరువు తీస్తూ మాట్లాడారు. విరాట్ కోహ్లీ హైట్ తక్కువగా ఉంటాడని.. అలాంటోడు ఎలా క్రికెట్ ఆడుతున్నాడని హేళన చేస్తూ మాట్లాడారు. బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న విరాట్ కోహ్లీ ముందే అసభ్యకరంగా బూతులు కూడా తిట్టారు. భూమికి జానెడు కూడా లేడని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనికి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.

కౌంటర్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అభిమానులు

Advertisement

విరాట్ కోహ్లీ హైట్ గురించి మాట్లాడిన వాళ్లపై అత్యంత దారుణంగా కౌంటర్ ఇస్తున్నారు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్. పొట్టోడు పొట్టోడు అంటూ మాట్లాడితే గుడ్డలు కూడా తీసి కొడతామని హెచ్చరిస్తున్నారు. అతనిని ట్రోల్ చేసే వాళ్లందరికీ కొంచెం కూడా సిగ్గు లేదని ఫైర్ అవుతున్నారు. మీ అందరికీ విరాట్ కోహ్లీ ఒక్కడే బాప్.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. విరాట్ కోహ్లీని ట్రోలింగ్ చేసే ముందు, అతని సైన్యం వెనుక ఉందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఒక్కసారి తిరగబడితే… అందరూ చిత్తు కావాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×