BigTV English

Chiranjeevi Comments on Pawan: పిఠాపురం నేను రావడం లేదు.. పవన్ నన్ను పిలవలేదు

Chiranjeevi Comments on Pawan: పిఠాపురం నేను రావడం లేదు.. పవన్ నన్ను పిలవలేదు

I am Not Coming to Pithapuram by Chiranjeevi: మరో మూడు రోజుల్లో ఏపీ ఎన్నికలు. ఎవరు గెలుస్తారా.. ? అని అని ఎంతో ఉత్కంఠగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒకవైపు కూటమి.. ఇంకోవైపు వైసీపీ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేనపైనే అందరి అంచనాలు ఉండడం విశేషం. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో నిలబడ్డాడు. ఆయనకు తోడుగా మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. ఇక గత కొన్నిరోజులు నుంచి టాలీవుడ్ మొత్తం పవన్ కు అండగా నిలబడుతుంది.


ఇక ఇప్పటికే చిరంజీవి సైతం పవన్ కు మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే పిఠాపురం ప్రచారంలో చిరు కూడా పాల్గొంటాడని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. నిన్నటికి నిన్న ఢిల్లీలో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న చిరంజీవి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఇక ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టగానే అభిమానులు చిరుకు పుష్పగుచ్ఛాలతో ఎదురువచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తనకు ఈ పురస్కారం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చిరు తెలిపాడు.

ఇక అనంతరం పిఠాపురం ప్రచారంపై మొదటి సారి నోరు విప్పాడు. తాను పిఠాపురం రావడం లేదని, అవన్నీ మీడియా అల్లిన కథనాలే అని స్పష్టం చేశాడు. మీరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారని అనుకోవాలి అన్న ప్రశ్నకు.. ” నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను. పిఠాపురానికి నేను వెళ్లడం లేదు. మీడియాలో అందరూ సర్క్యులేట్ చేశారు కానీ, ఆ వార్తలను మీడియా పెంచి పోషించింది.. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్లడం లేదు. మా కళ్యాణ్ బాబు నన్ను రమ్మని ఎప్పుడు కోరుకోలేదు. నా కంఫర్ట్ కు వదిలేస్తాడు. తాను కోరుకున్న లక్ష్యాలను సాధించాలని నేను కోరుకుంటున్నాను. తనతో పాటు నేను ఉన్నానుఅని చెప్పడానికి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాను. తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×