BigTV English

Lover Killed: ప్రియుడి కోసం 600 కిలోమీటర్లు ఆమె ట్రావెల్.. అతడి చేతిలో హత్య, ఏం జరిగింది?

Lover Killed: ప్రియుడి కోసం 600 కిలోమీటర్లు ఆమె ట్రావెల్.. అతడి చేతిలో హత్య, ఏం జరిగింది?

Lover Killed: భార్యభర్తల విభేదాలు.. కుటుంబాలు చిన్నాభిన్నం కాన్సెప్ట్ ఆధారంగా రెండు దశాబ్దాల కిందట తెలుగునాట సినిమాలు వచ్చేవి. ప్రస్తుతం సమాజంలో ఆ విధంగా జరుగుతున్నాయి. ఫలితంగా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లింది. అలాంటి ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.


రాజస్థాన్‌లో దారుణం వెలుగు చూసింది. 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన ప్రియురాలిని ఆమె ప్రియుడు పైలోకానికి పంపేశాడు. పైగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకుని నమ్మించే ప్రయత్నం చేశాడు. బార్మర్ జిల్లాలో ఈ దారుణం బయటపడింది. స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. 37 ఏళ్ల ముకేష్ కుమారి అంగన్‌వాడీ సూపర్ వైజర్ పని చేస్తోంది.

ముకేష్ కుమారికి వివాహం జరిగింది కూడా. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ప్రస్తుతం ఝుంఝును జిల్లాలో విధులు నిర్వహిస్తోంది. అదే సమయంలో కుమారికి బార్మర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు మనారామ్‌తో ఏడాదిగా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం మొదలైంది. అది ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు.


ప్రియుడ్ని కలిసేందుకు ముకేష్ 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది. అటు మనారామ్ కూడా ప్రేయసిని కలుసుకునేందుకు 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాడు. అయితే టీచర్ మనారామ్‌ ఫ్యామిలీ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని ముకేష్‌కుమారి.. టీచర్ మనారామ్‌ను ఫోన్‌లో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు ఒత్తిడి చేయడం మొదలైంది.

ALSO READ: తెరుచుకోని అంబులెన్స్ డోర్.. 15 నిమిషాలు ఆక్సిజన్ అందక

ఈ వ్యవహారం ముకేష్‌కుమారి-మనారామ్‌ మధ్య గొడవలకు దారి తీసింది. చివరకు తాడో పేడో తేల్చుకునేందుకు ఝుంఝును జిల్లా నుంచి ముకేష్ కుమారికి ఈనెల 10న తన కారులో 600 కిలోమీటర్లు ప్రయాణించి ప్రియుడు మనారామ్ ఇంటికి వెళ్లింది. కుమారి తమ ప్రేమ గురించి అతని ఫ్యామిలీకి క్లియర్‌గా చెప్పింది. దీంతో మనారామ్‌కు కోపం తన్నుకుంటూ వచ్చింది.

ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఇద్దరికీ సర్ది చెప్పి పంపించేశారు. అదే రోజు రాత్రి ఇద్దరు ఉన్నప్పుడు పెళ్లి విషయంపై మళ్లీ గొడవ జరిగింది. పట్టరాని కోపంతో మనారామ్ ఇనుప రాడ్‌తో ప్రియురాలు ముకేష్ తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత ముకేష్ మృతదేహాన్ని ఆమె వచ్చిన కారులో డ్రైవింగ్ సీట్‌లో ఉంచి ప్రమాదంలో చనిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశాడు.

చివరకు కారును రోడ్డు పక్కన ఉంచాడు. ఇంటికి వచ్చిన టీచర్ హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ముకేష్ గురించి తన లాయర్‌తో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అనేక అనుమానాలు, విషయాలు బయటకు వచ్చాయి. హత్య జరిగిన సమయంలో ముకేష్-మనారామ్ ఫోన్ లొకేషన్లు ఒకే చోట ఉన్నట్లు తేలింది.

దీంతో పోలీసులు మనారామ్‌ను అదుపులోకి విచారించారు. పైన చెప్పిన విషయాలను పూసగుచ్చి చెప్పాడు. నేరం తాను చేసినట్టు ఒప్పుకున్నాడు. ముకేష్ మృతదేహం బార్మర్ ఆసుపత్రిలో ఉంది. మృతిరాలి కుటుంబసభ్యుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు బార్మర్ ఎస్పీ నరేంద్ర సింగ్ తెలిపారు.

Related News

Jagitial Ambulance Incident: తెరుచుకొని అంబులెన్స్ డోర్.. 15 నిమిషాలు ఆక్సిజన్ అందక పేషెంట్

Mahabubabad News: ఇన్ స్టా లవ్.. అర్ధరాత్రి ఏకంగా భర్తను చంపబోయింది.. చివరకు?

Nalgonda Crime News: మైనర్ పై అత్యాచారం.. నిందితుడికి 22 ఏళ్ళు జైలు శిక్ష..

Nano Banana AI Scam: నానో బనానాతో రూ.70 వేలు పాయే.. వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్!

Rushikonda Beach Tragedy: రుషికొండ తీరంలో విషాదం.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ORR Car Incident: ఔటర్ పై కారు పల్టీ.. స్పాట్‌లో లేడీ సాప్ట్ వేర్ మృతి

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు..

Big Stories

×